రెడ్డి కమ్మగా మారితేనే సమస్య.. లోకేష్ - విజయసాయి ట్విట్టర్ వార్..
ఆమధ్య తన భార్యను నిందించారంటూ చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. విజయసాయి రెడ్డి ట్వీట్ లోని అంతరార్థం అదేనంటున్నారు. రెడ్డి, కమ్మగా మారితేనే సమస్య అనే ట్వీట్, పరోక్షంగా లోకేష్ ని టార్గెట్ చేసిందేనని చెబుతున్నారు.
తాడేపల్లిలో బుధవారం వైఎస్సార్సీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. బీసీలకు అత్యథిక రాజకీయ ప్రాధాన్యం ఇచ్చింది, ఇస్తోంది ఒక్క జగనేనని చెప్పారు నేతలు. కార్పొరేషన్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు ఎంపీ విజయసాయిరెడ్డి. దీనిపై టీడీపీ ఘాటుగా స్పందించింది. బీసీ నేతల ఆత్మీయ సమ్మేళనంలో అంతా రెడ్డి సామాజిక వర్గం నేతలే కనిపించారని, డామినేషన్ వారిదేనంటూ విమర్శించారు. నారా లోకేష్ ట్వీట్ తో మరింత కలకలం రేగింది. "విజయసాయి 'రెడ్డి', సుబ్బా 'రెడ్డి', పెద్ది 'రెడ్డి', సజ్జల రామకృష్ణా 'రెడ్డి' ఎప్పుడు బీసీలుగా మారారు? వీరికి న్యాయం జరిగితే బీసీలకు న్యాయం జరిగినట్టేనా? అంతా జగన్ 'రెడ్డి' మాయ! " అని ట్వీట్ చేశారు లోకేష్.
విజయసాయి కౌంటర్ అటాక్..
పప్పూ.. మేమంతా రెడ్లమే గానీ; మేం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, ఓసీ నిరుపేదలకు సేవకులం! రెడ్డి రెడ్డిగా ఉంటే ఏ సమస్యా లేదు, రెడ్డి కమ్మగా మారితేనే సమస్య!" అంటూ విజయసాయిరెడ్డి లోకేష్ కి రిప్లయ్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ సానుభూతిపరుల మధ్య మళ్లీ ట్వీట్ల యుద్ధం మొదలైంది.
పప్పూ...
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 26, 2022
మేమంతా రెడ్లమే గానీ; మేం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, ఓసీ నిరుపేదలకు సేవకులం!
రెడ్డి రెడ్డిగా ఉంటే ఏ సమస్యా లేదు, రెడ్డి కమ్మగా మారితేనే సమస్య! pic.twitter.com/boYohy0xkP
ఆమధ్య తన భార్యను నిందించారంటూ చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. విజయసాయి రెడ్డి ట్వీట్ లోని అంతరార్థం అదేనంటున్నారు. రెడ్డి, కమ్మగా మారితేనే సమస్య అంటూ విజయసాయి వేసిన ట్వీట్, పరోక్షంగా లోకేష్ ని టార్గెట్ చేసిందేనని చెబుతున్నారు. విజయసాయి ట్వీట్లకు వస్తున్న రిప్లయ్‌లన్నిట్లో లోకేష్ ని టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. అనవసరంగా బీసీ రెడ్డి అనే ప్రస్తావన తీసుకొచ్చి, ఇప్పుడు రెడ్డి కమ్మ అనే కామెంట్ ఎదుర్కున్నారని సెటైర్లు పేలుస్తున్నారు.