Telugu Global
Andhra Pradesh

టీటీడీ కొత్త పాలక మండలి సభ్యుల ఖరారు.. తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు

తెలంగాణ నుంచి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి భార్య గడ్డ సీతారెడ్డితో పాటు సూర్యాపేట జిల్లా హూజూర్‌నగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సామల రాంరెడ్డికి కూడా చోటు దక్కింది.

టీటీడీ కొత్త పాలక మండలి సభ్యుల ఖరారు.. తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు
X

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి నూతన కార్యవర్గ సభ్యులను ప్రభుత్వం ఖరారు చేసింది. టీటీడీ పాలక మండలి సభ్యులుగా చోటు కల్పించాలంటూ పలు రాష్ట్రాలు, రంగాల నుంచి అనేక వినతులు వచ్చాయి. దీనిపై కసరత్తు చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ.. 24 మందికి బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించింది. ఇందులో ఏపీకి చెందిన నలుగురు బీసీలు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటం గమనార్హం. ఈనెల 5నే టీటీడీకి కొత్త చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని నియమించగా.. ఆయన 10వ తేదీన బాధ్యతలు చేపట్టారు. 24 మందిలో కొత్తగా 18 మంది సభ్యులు నియామకం కాగా.. ఆరుగురు పాతవారినే పాలక మండలిలో కొనసాగించారు.

తెలంగాణ నుంచి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి భార్య గడ్డ సీతారెడ్డితో పాటు సూర్యాపేట జిల్లా హూజూర్‌నగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సామల రాంరెడ్డికి కూడా చోటు దక్కింది. తమిళనాడు నుంచి ముగ్గురికి, కర్ణాటక నుంచి ఇద్దరికి, మహారాష్ట్ర నుంచి నలుగురికి పాలక మండలిలో చోటు కల్పించారు.

కొత్త సభ్యులు వీరే..

1. పొన్నాడ సతీశ్ కుమార్ (ముమ్మిడివరం ఎమ్మెల్యే)

2. సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట ఎమ్మెల్యే)

3. ఎం. తిప్పేస్వామి (మడకశిర ఎమ్మెల్యే)

4. సిద్ధవటం యానాదయ్య

5. చండే అశ్వర్థ్ నాయక్

6. మేకా శేషుబాబు

7. ఆర్. వెంకటసుబ్బారెడ్డి

8. ఎల్లారెడ్డిగారి సీతారామరెడ్డి

9. గాదిరాజు వెంకట సుబ్బరాజు

10. పెనక శరత్ చంద్రారెడ్డి

11. సామల రాంరెడ్డి

12. బాలసుబ్రమణియన్ పళని స్వామి (తమిళనాడు)

13. ఎస్ఆర్. విశ్వనాథ్ రెడ్డి (కర్ణాటక, కొనసాగింపు)

14. గడ్డం సీతారెడ్డి (తెలంగాణ)

15. కృష్ణ మూర్తి వైద్యనాథన్ (తమిళనాడు, కొనసాగింపు)

16. సిద్దా వీర వెంకట సుధీర్ కుమార్

17. సుదర్శన్ వేణు

18. నెరుసు నాగసత్యం

19. ఆర్వీ. దేశ్ పాండే (కర్ణాటక)

20. అమోల్ కాలే (మహారాష్ట్ర, ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్)

21. డాక్టర్ ఎస్. శంకర్ (మహారాష్ట్ర, కొనసాగింపు)

22. మిలింద్ కేశవ్ నర్వేకర్ (మహారాష్ట్ర, ముంబై క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు, కొనసాగింపు)

23. డాక్టర్ కేతన్ దేశాయ్ (గుజరాత్, కొనసాగింపు)

24. బోరా సౌరభ్ (మహారాష్ట్ర, కొనసాగింపు)

*

First Published:  26 Aug 2023 7:46 AM IST
Next Story