శ్రీవారి బ్రేక్ దర్శనాల వేళల్లో మార్పుల యోచన
వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పు యోచన ఉన్నట్టు కూడా ఈవో వెల్లడించారు. రాత్రి నుంచే కంపార్ట్‌మెంట్లలో ఉండిపోయిన భక్తులకు ఉదయమే దర్శనం కల్పించేందుకు వీలుగా.. వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు.
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రానురాను పెరుగుతుండటంతో టీటీడీ అందుకు తగ్గట్టు చర్యలు తీసుకుంటోంది. తిరుమలలో గదుల కేటాయింపు కూడా పెద్ద సవాల్‌గా మారింది. కొండపైకి వచ్చాక వసతి లభించక చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో గదుల కేటాయింపు వ్యవస్థను కొండ కిందకు మార్చే యోచన చేస్తున్నట్టు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
గదుల కేటాయింపు వ్యవస్థను తిరుమల నుంచి కొండ కిందకు మార్చడం వల్ల.. తిరుమలలో గదులు లేని సమయంలో, గదులు దొరకని భక్తులు తిరుపతిలో మరొక చోట వసతి పొందే వీలుంటుందని వివరించారు. త్వరలోనే ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తామన్నారు.
వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పు యోచన ఉన్నట్టు కూడా ఈవో వెల్లడించారు. రాత్రి నుంచే కంపార్ట్‌మెంట్లలో ఉండిపోయిన భక్తులకు ఉదయమే దర్శనం కల్పించేందుకు వీలుగా.. వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. దీన్ని కూడా ప్రయోగాత్మకంగా అమలు చేసి ఫలితాలను చూస్తామన్నారు.
సెప్టెంబర్ నెలలో 21.12 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 122.29 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం వచ్చింది. లడ్డూల విక్రయం ద్వారా 98. 7 లక్షలు వచ్చినట్టు ఈవో వివరించారు.