Telugu Global
Andhra Pradesh

ఉద్యోగులకు జీతాల పెంపు.. టీటీడీ కీలక నిర్ణయాలివే

టీటీడీ బోర్డు తాజా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు చైర్మన్ కరుణాకర్ రెడ్డి.

ఉద్యోగులకు జీతాల పెంపు.. టీటీడీ కీలక నిర్ణయాలివే
X

తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులును విధులనుంచి తొలగిస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల సీఎం జగన్, టీటీడీ అధికారులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బోర్డులో చర్చించామని, ఆయన్ని తొలగించేందుకు ఏకగ్రీవ తీర్మానం చేశామని చెప్పారు టీటీడీ బోర్డ్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. ఆ వీడియో ఉన్నది తనే అయినా ఆడియో తనది కాదంటూ రమణ దీక్షితులు చెబుతున్నా టీటీడీ మాత్రం కఠిన నిర్ణయం తీసుకుంది. గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోకపోయినా వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు అనే హోదాలో నియమించి ఆయనకు ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వ అధినేతపై విమర్శలు చేసి ఉద్వాసనకు గురయ్యారు రమణ దీక్షితులు.

బోర్డు కీలక నిర్ణయాలివే..

టీటీడీ బోర్డు తాజా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు చైర్మన్ కరుణాకర్ రెడ్డి. ఔట్ సోర్సింగ్, కార్పొరేషన్ ఉద్యోగులతో కలిపి మొత్తం 9వేల మందికి జీతాలు పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

ఇతర నిర్ణయాలు..

- తిరుమల నడకదారిలో గాలిగోపురం, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిత్య సంకీర్తనార్చన కార్యక్రమం నిర్వహణ

- తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణం

- తిరుమల పెద్ద జీయర్‌స్వామి అనుమతి మేరకు, ద్వారపాలకులు జయవిజయలకు బంగారు తాపడం

- రూ.4 కోట్లతో తాళిబొట్లు తయారికి అంగీకారం

- వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగులకు కేటాయించే స్థలానికి రూ.8.16 కోట్లు

- తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు

- అలిపిరి , గాలిగోపురం నరసింహ స్వామి ఆలయం వద్ద ఉన్న ముగ్గు బావి ఆధునీకరణ

- బాలబాలికల్లో భక్తి పెంపొందించేందుకు 99 లక్షలు పుస్తాల ముద్రణకు

- స్విమ్స్‌లో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి ఉచిత వైధ్యం

- టీటీడీలో ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్యాంటీన్‌లో రూ.10కే భోజనం

- అన్నప్రసాద కేంద్రం సూపర్ వైజర్ పోస్టుల మంజూరు కోసం, పోటు సూపర్ వైజర్ పోస్టుల కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని టీటీడీ ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

First Published:  26 Feb 2024 3:07 PM IST
Next Story