Telugu Global
Andhra Pradesh

తిరుపతి వాసులకు టీటీడీ శుభవార్త

తిరుపతి వాసులకు టీటీడీ శుభ వార్త చెప్పింది. స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించింది.

తిరుపతి వాసులకు టీటీడీ శుభవార్త
X

తిరుపతి వాసులకు టీటీడీ శుభ వార్త చెప్పింది. స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు రేపటి నుంచి ఉచితంగా శ్రీవారి దర్శనం టికెట్లు జారీ చేయనుంది. తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు ఫ్రీగా జారీ చేస్తారు. మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో 500 టోకెన్లు ఉదయం 3 నుంచి 5గంటల మధ్య జారీ చేయనున్నారు.

అయితే శ్రీవారి దర్శనం టికెట్ తీసుకునేందుకు స్థానికులు ఆధార్‌కార్డ్ ఒరిజినల్ కచ్చితంగా చూపించాలని అధికారులు పేర్కొన్నారు. ముందుగా వచ్చిన వారికి మాత్రమే తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఫుట్‌పాత్‌ హాల్‌ దివ్యదర్శనం క్యూలైన్‌లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. ఇతర దర్శనాల్లో ఇచ్చే విధంగా దర్శనానంతరం ఒక లడ్డూ ఉచితంగా అందిస్తారు. స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వరకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

First Published:  1 Dec 2024 6:38 PM IST
Next Story