సీఎం చంద్రబాబును కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేడు ఉండవల్లిలో సీఎం చంద్రబాబును శ్రీనివాస కల్యాణం కార్యక్రమానికి ఆహ్వానించారు
BY Vamshi Kotas14 March 2025 6:32 PM IST

X
Vamshi Kotas Updated On: 14 March 2025 6:32 PM IST
ఏపీ సీఎం చంద్రబాబుతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు నేడు ఉండవల్లిలో కలిశారు. రేపు (మార్చి 15) అమరావతిలోని వెంకటపాలెంలో జరగనున్న శ్రీనివాస కల్యాణం కార్యక్రమానికి రావాలంటూ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. అంతేగాకుండా, సీఎం చంద్రబాబుకు స్వామివారి ప్రసాదం అందజేశారు.
వెంకటపాలెంలో నిర్వహిస్తున్న శ్రీనివాస కల్యాణం ఏర్పాట్ల గురించి బీఆర్ నాయుడు సీఎం చంద్రబాబుకు వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చైర్మన్ బీఆర్ నాయుడుకు, టీటీడీ బోర్డు సభ్యులకు సూచించారు.కాగా, సీఎం చంద్రబాబును కలిసిన వారిలో టీటీడీ పాలకమండలి సభ్యులు, టీటీడీ ఈవో, జేఈవో కూడా ఉన్నారు.
Next Story