నాని, వంశీ.. తొలి ట్రోలింగ్ బాధితులు
కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన వల్లభనేని వంశీ, కొడాలి నాని.. మూడో రౌండ్ మొదలయ్యే లోపే అక్కడినుంచి వెళ్లిపోయారు. వారు వెళ్లిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతానికి వెలువడుతున్న ఫలితాలన్నీ కేవలం ఆధిక్యాలే. అయితే మీడియా మాత్రం వైసీపీ ఓటమిని ఖాయం చేసింది. వైసీపీ శ్రేణులు పూర్తిగా డీలా పడ్డాయి. నాయకులు కూడా ఎక్కడా బయట కనిపించడంలేదు. కనీసం సాక్షి టీవీ డిబేట్ కి కూడా ఎవరూ రాలేదు. అటు కౌంటింగ్ కేంద్రాలనుంచి కూడా అభ్యర్థులు సైలెంట్ గా నిష్క్రమిస్తున్నారు.
నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. అహంకారంతో విర్రవీగితే, మహిళలని అవమానిస్తే, ప్రజలు చూస్తూ ఊరుకోరు.
— Telugu Desam Party (@JaiTDP) June 4, 2024
అప్పుడే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన గుడివాడ, గన్నవరం వైసీపీ అభ్యర్ధులు#KutamiTsunami #BabuIsBack #BossIsBack#ElectionResults #TDPJSPBJPWinning… pic.twitter.com/CchXPejg7I
వంశీ, నాని..
కొడాలి నాని, వల్లభనేని వంశీ.. వీరిద్దరిపై టీడీపీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. చంద్రబాబు, లోకేష్ ని చెడామడా తిట్టే నేతల్లో వంశీ, నాని ముందుంటారు. ఆమధ్య వంశీ చేసిన విమర్శలకు చంద్రబాబు పెద్ద సీన్ క్రియేట్ చేశారు కూడా. ఈ క్రమంలో వారిద్దర్నీ టీడీపీ అనుకూల సోషల్ మీడియా వెంటాడుతోంది. తాజాగా వారిద్దరూ మరోసారి సోషల్ మీడియాకు బుక్కయ్యారు. వైసీపీపై టీడీపీ ట్రోలింగ్ వారిద్దరినుంచే మొదలైంది.
కొడాలి నాని ,వల్లభనేని వంశీ జంప్ ..#kodalinani #vallabhanenivamshi #APElectionResults #apelections2024 #CountingDay #TV5News pic.twitter.com/fr0RQfWkZ4
— TV5 News (@tv5newsnow) June 4, 2024
కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన వల్లభనేని వంశీ, కొడాలి నాని.. మూడో రౌండ్ మొదలయ్యే లోపే అక్కడినుంచి వెళ్లిపోయారు. వారు వెళ్లిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నాని, వంశీ తొలి ట్రోలింగ్ బాధితులుగా మారారు.