Telugu Global
Andhra Pradesh

తొలిసంతకం ఏమైంది..? అప్పుడే మొదలైన ట్రోలింగ్

ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత చంద్రబాబు ప్రజలకు రెండు సంతకాలు బాకీ పడ్డారు.

తొలిసంతకం ఏమైంది..? అప్పుడే మొదలైన ట్రోలింగ్
X

అధికారంలోకి వస్తే నా తొలిసంతకం ఫలానా ఫైలుపైనే.. అని ఎవరైనా ధీమాగా చెప్పారంటే, ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఆ సంతకం సంగతి కూడా చూస్తారు. గతంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలుపై వైఎస్ఆర్ అలాగే సంతకం చేశారు, ఇటీవల తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఆరు గ్యారెంటీల ఫైలుపై సంతకం చేశారు. కానీ ఏపీలో మాత్రం ఆ లాంఛనం పూర్తి కాలేదు. ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత చంద్రబాబు ప్రజలకు రెండు సంతకాలు బాకీ పడ్డారు.

తొలి సంతకం ఏమైంది..?

అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఫైలుపై తొలి సంతకం పెడతానన్నారు చంద్రబాబు, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై పెడతానని సెలవిచ్చారు. కానీ అవేవీ జరగలేదు. ప్రమాణ స్వీకారోత్సవం అనగానే ఎల్లో మీడియా ఆ ఫైళ్లపైనే సంతకాలంటూ హడావిడి చేసింది. కానీ చంద్రబాబు మాత్రం ఎందుకో వెనక్కి తగ్గారు. హడావిడిగా సంతకాలు పెట్టి ఆనక నోటిఫికేషన్ విడుదల చేయకపోతే బాగోదని అనుకున్నారేమో సంతకం విషయాన్ని దాటవేశారు. ప్రస్తుతానికి జగన్ ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ఇంకా ఫోర్స్ లోనే ఉంది. అప్లికేషన్లు తీసుకున్నారు కానీ, ఎగ్జామ్ పెట్టలేదు. ఆ పని పూర్తయ్యాక మెగా డీఎస్సీ సంగతి చూస్తారేమో తేలాల్సి ఉంది.


హామీల అమలు సంగతేంటి..?

అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు లెక్కకు మిక్కిలి హామీలిచ్చారు. ఆ స్థాయిలో జగన్ కి అబద్ధాలు చెప్పడం చేతగాత, నవరత్నాలు కొనసాగిస్తా, కొన్ని పథకాలకు డబ్బులు పొడిగిస్తానని మాత్రమే చెప్పారు. జనాలకు ఆయన హామీలు నచ్చలేదు, కూటమి హామీలు నమ్మి ఓటు వేశారు. మరి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. యథాతథంగా హామీలు అమలు చేయడం అసాధ్యమనేది అందరికీ తెలిసిన విషయం. చంద్రబాబు ఈ గండం ఎలా గట్టెక్కుతారనేదే చూడాలి.

First Published:  12 Jun 2024 9:15 AM GMT
Next Story