ఏపీలో రేపు ఏజెన్సీ ప్రాంతాల బంద్ కు పిలుపునిచ్చిన ఆదివాసీ సంఘాలు
బంద్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళే బస్సులను రేపు ఆర్టీసీ రద్దు చేసింది.
BY Telugu Global30 March 2023 3:33 PM GMT
X
Telugu Global Updated On: 30 March 2023 3:33 PM GMT
ఆంధ్రప్రదేశ్ లో బోయ, వాల్మీక కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని ఆదివాసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదివాసీ సంఘాలు రేపు ఏజెన్సీ బంద్ కు పిలుపునిచ్చాయి.
బంద్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళే బస్సులను రేపు ఆర్టీసీ రద్దు చేసింది.
కాగా, అరకు,బొర్ర గుహల సందర్శనకు వచ్చే పర్యాటకులు రక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని, హోటళ్లు, రిసార్ట్, లాడ్జీల్లో ఉన్న పర్యటకులను బయటకు వెళ్లనీయవద్దని ఆదివాసీ సంఘాలు విజ్ఞప్తి చేశాయి.
Next Story