పవన్‌కల్యాణ్‌పై ట్రాన్స్‌జెండర్ తమన్నా పోటీ..!
తమన్నా సింహాద్రిది కృష్ణా జిల్లా అవనిగడ్డ కాగా.. సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. గతంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే వైసీపీ వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించగా.. తాజాగా భారత చైతన్య యువజన పార్టీ సంచలనానికి తెరతీసింది. పవన్‌కల్యాణ్‌పై ట్రాన్స్‌జెండర్, బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రిని పోటీకి దింపింది. పిఠాపురం నుంచి తమన్నా పోటీ చేస్తారని BCY పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ ప్రకటించారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్‌పై పోటీ చేసి వార్తల్లో నిలిచారు తమన్నా.
తమన్నా సింహాద్రిది కృష్ణా జిల్లా అవనిగడ్డ కాగా.. సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. గతంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తమన్నా సింహాద్రికి గుర్తింపు వచ్చింది. ఇక గతంలో జనసేన పార్టీలో పనిచేశారు తమన్నా. అయితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపినప్పటికీ.. పార్టీ టికెట్ కేటాయించలేదు. దీంతో ఈసారి ఏకంగా ఆ పార్టీ చీఫ్ పవన్‌కల్యాణ్‌పైనే పోటీకి సిద్ధమయ్యారు తమన్నా.
మొత్తం 32 మంది అభ్యర్థులతో మొదటి లిస్టును విడుదల చేశారు పార్టీ చీఫ్ రామచంద్రయాదవ్. పార్టీ చీఫ్ రామచంద్రయాదవ్ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరుతో పాటు నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలోనూ ఆయన బరిలో ఉండనున్నారు.