గుంటూరు జిల్లాలో ఘోరం.. - ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మృతి.. 20 మందికి గాయాలు
ప్రత్తిపాడు మండలం కొండెపాడు వాసులు చేబ్రోలు మండలం జూపూడికి శుభకార్యం కోసం ట్రాక్టర్‌పై బయలుదేరారు. వట్టిచెరుకూరు వద్దకు చేరుకునేసరికి ట్రాక్టర్ అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.

Guntur Road Accident : గుంటూరు జిల్లాలో ఘోరం.. - ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మృతి.. 20 మందికి గాయాలు
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 30 మందితో వెళ్తున్న ట్రాక్టర్ పంట కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడటంతో ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటనలో 20 మంది గాయాలపాలయ్యారు. సోమవారం జరిగిన ఈ ఘటన పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
శుభకార్యానికి వెళ్తుండగా..
ప్రత్తిపాడు మండలం కొండెపాడు వాసులు చేబ్రోలు మండలం జూపూడికి శుభకార్యం కోసం ట్రాక్టర్‌పై బయలుదేరారు. వట్టిచెరుకూరు వద్దకు చేరుకునేసరికి ట్రాక్టర్ అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు.
మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంలోనే చనిపోయారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో 20 మందికి గాయాలు కాగా, వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.