Telugu Global
Andhra Pradesh

టమాటా రేట్లు పెరగడానికి కారణం చెప్పిన చంద్రబాబు

టీడీపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన చంద్రబాబు, సీఎం జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. వ్యవస్థలను చంపేసి రివర్స్‌ గేర్‌ లో నడిపిస్తున్నారని మండిపడ్డారు.

టమాటా రేట్లు పెరగడానికి కారణం చెప్పిన చంద్రబాబు
X

దేశవ్యాప్తంగా టమాటా రేట్లు భగ్గుమంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి ధరలు చుక్కలనంటుతున్నాయి. పైగా భారీ వర్షాలతో పంట సకాలంలో అందుబాటులోకి రాకపోవడంతో ఇప్పుడల్లా రేట్లు తగ్గేలా లేవు. దాదాపు భారత్ లోని అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య ఉంది. అయితే టమాటా రేట్లకు, సీఎం జగన్ కు సంబంధం ఉందంటున్నారు చంద్రబాబు. టమాటా రేట్లు పెరగడానికి కారణం సీఎం జగన్ అని మండిపడ్డారు చంద్రబాబు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు టమాటా వేయడం మానేశారని, అందుకే ఇప్పుడు ధరలు పెరిగాయంటున్నారు. ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి ఉంటే ఈ తిప్పలు వచ్చేవి కావన్నారు. ఏపీలో ప్రస్తుతం 93శాతం మంది రైతులు అప్పులపాలయ్యారని, ఏపీ రైతుపై సగటున రూ.2.45లక్షల అప్పు ఉందన్నారు.

టీడీపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన చంద్రబాబు, సీఎం జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. వ్యవస్థలను చంపేసి రివర్స్‌ గేర్‌ లో నడిపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్షోభానికి కారణమైన జగన్‌ కు పరిపాలించే అర్హత ఎక్కడిదని నిలదీశారు.


గంజాయి విషయంలో భేష్..

ఏపీలో గంజాయి పంటకు మాత్రం బ్రహ్మాండంగా డిమాండ్ ఉందని అది మినహా మిగతా అన్ని పంటలు సంక్షోభంలో ఉన్నాయని ఎద్దేవా చేశారు చంద్రబాబు. జగన్‌ పాలనలో అద్భుతంగా సాగయ్యే పంట గంజాయి మాత్రమేనని చెప్పారు. టీడీపీ హయాంలో రాయలసీమలో హార్టికల్చర్‌, కోస్తాలో ఆక్వాకల్చర్‌ కు ప్రాధాన్యమిచ్చామని, ఇప్పుడు అవి రెండూ సంక్షోభంలోనే ఉన్నాయన్నారు చంద్రబాబు. ఆర్బీకేలు దోపిడీ కేంద్రాలుగా మారాయని విమర్శించారు. రైతులు అప్పులపాలవుతుంటే, జగన్ మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని కౌంటర్లిచ్చారు.

ఆర్-5జోన్ పై..

అమరావతిలోని ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేయడంపై కూడా చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. రైతుల భూమి దానం చేసిన జగన్‌ దానకర్ణుడా..? అని నిలదీశారు. రాజధాని రైతుల భూమి వేరొకరికి దానం చేశారని, అంత దానం చేసే గుణమే ఉంటే తన భూమి ఇవ్వొచ్చుగా? అని ప్రశ్నించారు. ఆర్‌-5 జోన్‌ లో ఇళ్ల నిర్మాణానికి కోర్టు అనుమతి రాలేదు కదా.. అన్నారు. అమరావతి రైతులపై జగన్‌ కు ఎందుకంత కక్ష? అని చంద్రబాబు మండిపడ్డారు.

First Published:  25 July 2023 2:47 PM IST
Next Story