Telugu Global
Andhra Pradesh

వెటకారాలు, పంచ్ డైలాగ్ లు.. టాలీవుడ్ ముందు జాగ్రత్తలు

జబర్దస్త్ పిలుస్తోంది రా, కదలిరా.. అంటూ రోజాని వెటకారం చేస్తూ ట్వీట్ వేశారు బండ్ల గణేష్. దర్శకుడు రాఘవేంద్రరావు చంద్రబాబుకి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ వేశారు.

వెటకారాలు, పంచ్ డైలాగ్ లు.. టాలీవుడ్ ముందు జాగ్రత్తలు
X

ఏపీ ఎన్నికల ఫలితాలను టాలీవుడ్ ఆసక్తిగా గమనిస్తోంది. గతంలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత ఎప్పటికోగాని జగన్ ని కలిసేందుకు సినీ నటులు, నిర్మాతలు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అని తేలిపోగానే.. టాలీవుడ్ అప్రమత్తమైంది. కూటమి విజయంపై ఎవరికి వాళ్లు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఆయనకు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.


తెలంగాణలో కాంగ్రెస్ నేతగా చలామణి అవుతున్న నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. అప్పుడే వెటకారం మొదలు పెట్టారు. రోజాపై ఆయన సెటైర్లు ఎక్కుపెట్టారు. జబర్దస్త్ పిలుస్తోంది రా, కదలిరా.. అంటూ ట్వీట్ వేశారు బండ్ల. ఇటీవల అనారోగ్యంతో ఆయన ఆస్పత్రి బెడ్ పై ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈరోజు కూటమి విజయం చూశాక, అనారోగ్యంతో ఉన్నా కూడా ఆయన తన వెటకారానికి ఇలా పదునుపెట్టారు. ఆ తర్వాత మరో ట్వీట్ లో రోజా, నాని, వంశీ, అంబటిపై కూడా సెటైర్లు పేల్చారు బండ్ల.




దర్శకుడు రాఘవేంద్రరావు చంద్రబాబుకి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ వేశారు.

దర్శకుడు హరీష్ శంకర్ కూడా కూటమి విజయం ఖాయమని తేలిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ లోని ఓ చిన్న వీడియో బిట్ ని ట్విట్టర్లో అప్ లోడ్ చేశారు. గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుందని పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్ ని ఆయన పోస్ట్ చేశారు. మెగా ఫ్యామిలీ హీరోలు కూడా పవన్ కల్యాణ్ వీడియోల్ని పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది కూటమి విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ తరపున పిఠాపురం వచ్చి ప్రచారం చేసిన నటీనటులు సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.

First Published:  4 Jun 2024 8:04 AM GMT
Next Story