Telugu Global
Andhra Pradesh

ఆన్ లైన్ లో శ్రీవారి లడ్డూల అమ్మకం.. ఎంతవరకు నిజం..?

Tirupati Laddu Online: ఆన్ లైన్ లో శ్రీవారి లడ్డూలు ఆర్డర్ చేస్తే ఇంటికే పార్శిల్ వస్తుందని ఇదిగో దానికి సంబంధించిన వెబ్ సైట్ లింక్ అంటూ కొన్ని డొమైన్లు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చాలామంది నమ్మారు.

Tirupati Laddu Online
X

ఆన్ లైన్ లో శ్రీవారి లడ్డూల అమ్మకం.. ఎంతవరకు నిజం..?

ఆన్ లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముతారని భక్తులకు తెలుసు. నెలకోసారి విడుదల చేసే ఆన్ లైన్ కోటా కోసం భక్తులు ఆశగా ఎదురు చూస్తుంటారు. అయితే ఆన్ లైన్ లో లడ్డూలు కూడా అమ్ముతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఆన్ లైన్ లో శ్రీవారి లడ్డూలు ఆర్డర్ చేస్తే ఇంటికే పార్శిల్ వస్తుందని ఇదిగో దానికి సంబంధించిన వెబ్ సైట్ లింక్ అంటూ కొన్ని డొమైన్లు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చాలామంది నమ్మారు. అయితే ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ టీటీడీ వివరణ ఇచ్చింది.

ఆన్ లైన్ లో లడ్డూలు విక్రయించడంలేదు..

శ్రీవారి లడ్డూ ప్రసాదం కావాలంటే కచ్చితంగా తిరుమల వెళ్లాల్సిందే. టీటీడీ కల్యాణ మండపాల్లో అప్పుడప్పుడూ లడ్డూ ప్రసాదం విక్రయిస్తుంటారు. ఇది చాలా పరిమితం. అయితే ఇప్పుడంతా ఆన్ లైన్ కావడంతో శ్రీవారి లడ్డూ కూడా ఆ లైన్ లో తెప్పించుకోవచ్చనే ప్రచారం మొదలైంది. ఈ ప్రచారంపై వెంటనే టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఇదంతా తప్పుడు ప్రచారమని, భక్తులెవరూ ఇలాంటి ఆన్ లైన్ వెబ్ సైట్ల ద్వారా లడ్డూలకు డబ్బులు చెల్లించి మోసపోవద్దని తెలిపింది.

ఆన్ లైన్ లో దర్శనం టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే అదనపు లడ్డూలు కావాలంటే ప్రత్యేకంగా డబ్బు చెల్లించాలి. అంతే కాని, దర్శనం టికెట్ లేకుండా కేవలం లడ్డూలు బుక్ చేసుకోవాలంటే కుదరదు. ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది టీటీడీ. భక్తులు వీటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

First Published:  13 Dec 2022 9:11 AM IST
Next Story