Telugu Global
Andhra Pradesh

తిరుమల లడ్డూ కల్తీలో కీలక పరిమాణం

కల్తీ లడ్డూ వివాదానికి సంబంధించి విచారణలో భాగంగా తిరుమలలో సిట్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

తిరుమల లడ్డూ కల్తీలో కీలక పరిమాణం
X

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సిట్ అధికారులు సంచలన విషయాలు బయటపెట్టారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్‌కు చెందిన అధికారులు తాజాగా సీబీఐ డైరెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కల్తీ నెయ్యి కేసు విచారణలో సేకరించిన సమాచారాన్ని సీబీఐ డైరెక్టర్‌కు వివరించారు. అసలు ఈ నెయ్యి ఏఆర్ డెయిరీ తయారు చేసింది కాదనే సంచలన విషయాన్నితెలిపారు. టీటీడీతో ఏఆర్ డెయిరీ సంస్థ ఒప్పందం మేరకు లడ్డూ తయారు చేసేందుకు అవసరమైన నెయ్యిని సరఫరా చేయాల్సి ఉంది. ఒప్పందానికి విరుద్ధంగా ఏఆర్ డెయిరీ నిర్వాహకులు వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించి.. తమ ట్యాంకర్ల ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్టు సిట్ అధికారుల విచారణలో తేల్చారు.టీటీడీలో సిట్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. శనగపప్పు పిండి పట్టడం, నెయ్యి సేకరణ, నాణ్యత తనిఖీకి ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను పరిశీలించారు. పోటు ఏఈవో మునిరత్నంతో మాట్లాడి రోజువారీ విక్రయాలు, పంపిణీ విధానం తెలుసుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం సరఫరాచేసిన నెయ్యి కల్తీ జరిగిందన్న ఆందోళన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం విచారణకు సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. లడ్డూ తయారీకి రోజువారీ వినియోగించే ముడిసరుకుల పరిమాణం వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పప్పు దినుసులు నిల్వ చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. వాటి రోజువారీ వినియోగం మోతాదు, నాణ్యతా పరీక్షల గురించి ఆరా తీశారు. పిండి మరలను కూడా పరిశీలించారు

First Published:  15 Dec 2024 1:18 PM IST
Next Story