Telugu Global
Andhra Pradesh

ఇడ్లీ గొడవకి కూడా రెడ్ బుక్ వాడాలా..?

ఇడ్లీ కొట్టు దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఇడ్లీ గొడవకి కూడా రెడ్ బుక్ వాడాలా..?
X

నరసన్నపేటలో ఓ టిఫిన్ బండి దగ్గర గొడవ జరిగింది.

గణపతి అనే వ్యక్తి టిఫిన్ బండి పెట్టుకున్న మహిళని ఇడ్లీ అడిగాడు.

5 నిమిషాల తర్వాత ఇస్తానని ఆమె అన్నది.

అక్కడే మాటా మాటా పెరిగింది.

టిఫిన్ కొట్టుపై దాడి చేసి చట్నీ కిందపడేశాడు గణపతి. దీంతో గొడవ పెద్దదైంది. వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ చేసి.. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అంటూ కామెంట్ పెట్టారు.


రాష్ట్రంలో గూండారాజ్యం నడుస్తోందని, కూటమి నేతల ప్రైవేట్‌ సైన్యం ప్రజలపై దాదాగిరి చేస్తోందని, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలంటున్నారు. నరసన్నపేటలో జరిగిన దాడికి కారణం అయిన గణపతి అనే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రైవేట్ పీఏ అని, అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో వారి ఆగడాలు శృతి మించాయని వైసీపీ విమర్శిస్తోంది.

ఆఖరికి ఇడ్లీ బండి దగ్గర కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అది అప్పటికప్పుడు జరిగిన గొడవా, లేక కావాలనే టీడీపీ నేతలు ఆ టిఫిన్ కొట్టు యజమానిపై కక్ష సాధింపులకు దిగారా అనేది తేలాల్సి ఉంది. అయితే ఇడ్లీ కొట్టు దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

First Published:  20 Aug 2024 2:11 PM GMT
Next Story