ఈ జిల్లాల్లో ఈ రోజు పిడుగులు పడతాయి... ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక
వర్షాలు, పిడుగులతో పాటు గంటకు 40 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రజలను హెచ్చరించింది.
రానున్న 2, 3 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతే కాకుండా తిరుపతి, నెల్లూరు, కడప, అన్నమయ్య, సత్యసాయి, అనంతపూర్, నంధ్యాల, కర్నూలు, పల్నాడు, ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలతోపాటు, పెద్ద ఎత్తున పిడుగులు పడనున్నాయి.
వర్షాలు, పిడుగులతో పాటు గంటకు 40 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే తప్ప బైటికి రావద్దని, పొలం పనులకు వెళ్ళినవారు, గ్రామం బైట ఉన్న వారు వెంటనే ఇళ్ళకు వెళ్ళిపోవాలని వాతావరణ శాఖ సూచించింది.