Telugu Global
Andhra Pradesh

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వెళ్ళిన సింగరేణి అధికారులు

స్టీల్ ప్లాంట్ ను తమ మిత్రులైన కార్పోరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు మోడీ ప్రభుత్వం సిద్దమవుతోంది. అందువల్ల కేంద్రం కుట్రలను బద్దలు కొట్టడానికి స్టీల్ ప్లాంట్ ను తామే కొని ప్రభుత్వ రంగంలోనే నడిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వెళ్ళిన సింగరేణి అధికారులు
X

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడానికి కేంద్ర సిద్దమైన నేపథ్యంలో వేలంలో బిడ్ వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు. అయితే ఎవరు ఎన్ని నిరసనలు తెలిపినా, పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోగా స్టీల్ ప్లాంట్ ను తమ మిత్రులైన కార్పోరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు మోడీ ప్రభుత్వం సిద్దమవుతోంది. అందువల్ల కేంద్రం కుట్రలను బద్దలు కొట్టడానికి స్టీల్ ప్లాంట్ ను తామే కొని ప్రభుత్వ రంగంలోనే నడిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా సింగరేణి కాలరీస్ కంపెనీ ద్వారా స్టీల్ ప్లాంట్ కొనడానికి కేసీఆర్ సిద్దమయ్యారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ వేలంలో బిడ్ దాఖలు చేయడానికి ముందు ప్లాంట్ ను పరిశీలించడానికి సింగరేణి కాలరీస్ కు చెందిన ముగ్గురు డైరెక్టర్లు ప్లాంట్ ను ఈ రోజు సందర్శించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సింగరేణి జాయింట్ వెంచర్ కింద ఉక్కు పరిశ్రమను స్వాధీనం చేసుకునేందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ప్లాంట్ ను పరిశీలించడంతో పాటు అధికారులతో ఇతర విషయాలను చర్చించడానికి సింగరేణి అధికారులు ఈ రోజు, రేపు అక్కడే ఉండనున్నారు.

First Published:  11 April 2023 1:31 PM IST
Next Story