ముగ్గురు ప్రముఖులు..ఒకే రోజు
సెప్టెంబర్ 2వ తేదీ తెలుగురాష్ట్రాల ప్రజలకు విషాద, ఆనందాలను పంచిన రోజు. తెలుగు ప్రముఖులైన రాజన్న వర్ధంతి, హరికృష్ణ జయంతికి నివాళులు, పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సంబరాల సందేశాలతో ఈ రోజంతా సోషల్‌మీడియా హోరెత్తిపోతుంది.
ఒకే రోజు ముగ్గురు ప్రముఖుల జీవితాల్లో ముఖ్యమైన రోజులు. లక్షలాది మంది ఆనందించే ఇదే రోజు, లక్షలాది మంది కన్నీరు పెట్టిన రోజు కావడం యాధృచ్చికమే. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009 సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రిగా ఆరంభించబోయే రచ్చబండ కార్యక్రమానికి బయల్దేరి హెలికాప్టర్ ప్రమాదంలో దివంగతులయ్యారు. రాజన్న ఇక లేడనే సమాచారంతో గుండెలు పగిలి తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది కన్నుమూశారు.
ముఖ్యమంత్రి తనయుడిగా, నటుడిగా, రాజకీయ నేతగా, వ్యాపారవేత్తగా రాణించిన నందమూరి హరికృష్ణ 1956 సెప్టెంబర్ 2న జన్మించారు. ఓ రోడ్డు ప్రమాదంలో మత్యువాత పడిన బహుముఖ ప్రతిభావంతుడైన హరికృష్ణ జయంతిని ఆయన అభిమానులు ఈ రోజు జరుపుకుంటున్నారు.
చిరంజీవి తమ్ముడిగా సినీరంగ ప్రవేశం చేసి.. పవర్ స్టార్‌గా ఎదిగిన పవన్‌కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న కావడంతో రాష్ట్రమంతా ఆయన అభిమానులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆయన పాత సినిమాలను మళ్లీ థియేటర్లలో వేసుకుని సందడి చేస్తున్నారు. నటుడిగానే కాకుండా జనసేన అధ్యక్షుడిగా రాజకీయాల్లో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సెప్టెంబర్ 2వ తేదీ తెలుగురాష్ట్రాల ప్రజలకు విషాద, ఆనందాలను పంచిన రోజు. తెలుగు ప్రముఖులైన రాజన్న వర్ధంతి, హరికృష్ణ జయంతికి నివాళులు, పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సంబరాల సందేశాలతో ఈ రోజంతా సోషల్‌మీడియా హోరెత్తిపోతుంది.