Telugu Global
Andhra Pradesh

వ‌చ్చే ఎన్నిక‌ల‌పై వైసీపీ ధీమా ఇద‌న్న‌మాట‌!

వచ్చే ఎన్నికల్లో క‌చ్చితంగా 60 శాతం పైగా ఓట్ల షేర్ తో విజ‌యం సాధిస్తామ‌ని స‌జ్జ‌ల తెలిపారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ సహా అన్ని పార్టీలూ కలసికట్టుగా వచ్చినా వ్యతిరేక ఓట్లని ఎన్ని సార్లు కలుపుకున్నా కూడా వైసీపీ గెలుపుని అసలు ఆపలేరని ఆయన చెప్పారు.

వ‌చ్చే ఎన్నిక‌ల‌పై వైసీపీ ధీమా ఇద‌న్న‌మాట‌!
X

రానున్న 2024 ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎన్ని క‌లిసి పోటీ చేసినా గెలిచేది మాత్రం తామేన‌ని వైసీపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తేల్చి చెబుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం త‌థ్య‌మ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. టీడీపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుండ‌గా, బీజేపీని కూడా క‌లుపుకునేందుకు చంద్ర‌బాబు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో ఈ కూట‌మి వల్లే అధికారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో మ‌ళ్లీ అదే త‌మ‌కు అధికారాన్ని అందిస్తుంద‌ని ఆయ‌న బ‌లంగా న‌మ్ముతున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి సంద‌ర్భాన్నీ ఆయ‌న బీజేపీతో స‌యోధ్య కోసం ఉప‌యోగించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే బుధ‌వారం స‌జ్జ‌ల మీడియాతో మాట్లాడుతూ ఏపీలో మొత్తం ఓటర్లలో 70 శాతం మంది పూర్తి మద్దతు వైసీపీకే ఉందని, ఇది తమకు ఉన్న పూర్తి సమాచారమని క్లారిటీ ఇచ్చారు. త‌మ‌కు ఉన్న వ్య‌తిరేక ఓటు 30 శాతం మాత్రమేన‌ని, దాన్ని చీల్చినా కలుపుకున్నా తమకేమీ కాదని ఆయ‌న చెప్పారు. ఒకవేళ ఎన్నికల నాటికి ఏమైనా ఇబ్బందులు వచ్చి పాజిటివ్ ఓట్ల షేర్ కనుక మరో పది శాతం తగ్గినా తమకు వచ్చిన ఇబ్బంది కూడా ఏమీ లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో క‌చ్చితంగా 60 శాతం పైగా ఓట్ల షేర్ తో విజ‌యం సాధిస్తామ‌ని స‌జ్జ‌ల తెలిపారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ సహా అన్ని పార్టీలూ కలసికట్టుగా వచ్చినా వ్యతిరేక ఓట్లని ఎన్ని సార్లు కలుపుకున్నా కూడా వైసీపీ గెలుపుని అసలు ఆపలేరని ఆయన చెప్పారు. వైసీపీని ఓడిస్తామ‌ని డాంబికాలు చెబుతున్న చంద్ర‌బాబునాయుడు అస‌లు 175 సీట్ల‌కు పోటీ పెట్ట‌లేని ప‌రిస్థితిలో ఉన్నార‌ని గుర్తుచేశారు. పొత్తులతోనే ఏపీలో పోటీకి దిగాలని చూస్తున్న చంద్రబాబు టీడీపీ గేట్లు తీస్తే వైసీపీ ఖాళీ అవుతుందని ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

ఏపీలో టీడీపీకి ప్ర‌జ‌లు బ్రహ్మరథం పడుతున్నారని చెబుతున్న చంద్ర‌బాబు పొత్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నార‌ని స‌జ్జ‌ల ప్ర‌శ్నించారు. బీజేపీతో చంద్ర‌బాబుకు పొత్తు క‌లిపేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రి కూడా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అధికారంలో ఉన్న‌ప్పుడు చేసిందేమిటో.. గెలిస్తే చేసేదేమిటో చెప్పుకోలేని ద‌య‌నీయ స్థితిలో టీడీపీ ఉంద‌ని ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌ల ఎద్దేవా చేశారు. ఎవ‌రెన్న పొత్తుల‌తో వ‌చ్చినా త‌మ పొత్తు మాత్రం ప్ర‌జ‌లతోనే అని స్ప‌ష్టం చేశారు.

*

First Published:  31 Aug 2023 10:53 AM IST
Next Story