తిరుమల లడ్డూ నెయ్యిలో ఎలాంటి నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ తెలిపింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి నాణ్యతా లోపం లేదని తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ వెల్లడించింది. తాము దేశవ్యాప్తంగా 25 ఏండ్లుగా డెయిరీ సేవలను అందిస్తున్నామని ఎప్పుడు ఎలాంటి ఆరోపణలు రాలేదని పేర్కొన్నారు. తాము సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టం చేసింది. తాజాగా తమ సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో టీటీడీకి అందించే నెయ్యి నాణ్యత ప్రమాణాలపై టెస్టులు నిర్వహించామని పేర్కొంది. ఆ టెస్టుల్లో నెయ్యిలో ఎలాంటి లోపాలు లేవని తేలిందని చెప్పింది. కానీ తమపై విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
టీటీడీ అడిగిన వెంటనే సంబంధిత రిపోర్టును పంపించామని తెలిపింది. కానీ టీటీడీ నుంచి తమకు స్పందన రాలేదని తెలిపింది. శ్రీవారి లడ్డూ తక్కువ ధరకి నాసిరకమైన నెయ్యిని టెండర్ దారుడు సప్లై చేశారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. నెయ్యి నాణ్యత లేకపోవడంతో నాలుగు ట్యాంకర్‌ల నెయ్యిని వెనక్కి పంపించేశామన్నారు. జూలై 6, 12 వ తేదీన నెయ్యి శాంపిల్స్ ని టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపామని.. నెయ్యిలో కల్తీ జరిగినట్లు రిపోర్ట్ వచ్చిందని ఈవోతెలిపారు.