నిజం నా వైపు ఉన్నది.. ఎన్నిసార్లైనా కోర్టుకు వస్తా
సాక్షిపై పరువు నష్టం కేసులో విశాఖ కోర్టుకు వచ్చిన మంత్రి లోకేశ్
BY Raju Asari27 Jan 2025 1:51 PM IST
X
Raju Asari Updated On: 27 Jan 2025 1:51 PM IST
సాక్షిపై పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేశ్ విశాఖ కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 2019 లో సాక్షి పత్రిక తనపై అసత్య ఆరోపణలు చేసిందన్నారు. అప్పుడే వారికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. గత ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను. ఇది నాలుగో వాయిదా.. నిజం నా వైపు ఉన్నది. ఎన్నిసార్లయినా వస్తాను.. ఆలస్యమైనా నిజం గెలుస్తుందన్నారు. ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం తిన్నాను. ప్రభుత్వం నుంచి ఒక్క వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు. వచ్చిన వాహనం కూడా నాదే. సొంత డబ్బుతో డీజిల్ కొట్టించుకున్నా.. ఎక్కడా ప్రభుత్వంపై ఆధారపడకూడదని నా తల్లి భువనేశ్వరి చిన్నప్పటి నుంచి నేర్పించారని లోకేశ్ తెలిపారు.
Next Story