Telugu Global
Andhra Pradesh

ఓవర్ కాన్ఫిడెన్సే కొంపముంచిందా?

అప్పట్లో జగన్‌ను అమ్మనాబూతులు తిట్టినందుకు అరెస్టయ్యాడు. అయితే 24 గంటలు కూడా కస్టడీలో ఉండకుండా బెయిల్ పైన బయటకొచ్చేశాడు. అప్పటి నుండే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. తాను ఎవరిపైన ఎలా మాట్లాడినా ఇబ్బంది లేదని బెయిల్ తీసుకుని ఈజీగా బయటకు వచ్చేయన్నది తమ్ముడి నమ్మకం.

ఓవర్ కాన్ఫిడెన్సే కొంపముంచిందా?
X

కొమ్మారెడ్డి పట్టాభిరామ్..కొత్తగా పరిచయటం అవసరంలేని తమ్ముడు. చాలాకాలంగా వార్తల్లో నలుగుతున్నా ఇప్పుడు మాత్రం మూడురోజులుగా వరుసగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. ప్రత్యర్ధులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద నోటికొచ్చిన బూతులు తిట్టడంతో బాగా పాపులరయ్యాడు. అప్పటి నుండి తనలో ఓవర్ కాన్పిడెన్స్ బాగా పెరిగిపోయినట్లుంది. అందుకనే ఎవరిని పడితే వాళ్ళని అరేయ్..ఒరేయ్ అని మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు గన్నవరంలో గొడవకు కూడా తమ్ముడి ఓవర్ యాక్షనే కారణమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుండి పోటీ చేయాలని పట్టాభి రెడీ అవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయేది తానే అని సెల్ఫ్ డిక్లరేషన్ కూడా చేసుకున్నారు. అప్పటి నుండి నియోజకవర్గంపై బాగా దృష్టి పెట్టారు. అయితే వైసీపీ తరపున పోటీ చేయబోతున్న వల్లభనేని వంశీ తక్కువోడేమీ కాదు. ఆర్ధిక, అంగ బలాల్లో బాగా గట్టినేతనే చెప్పాలి. నిత్యం జనాల్లోనే తిరుగుతుంటారు. కాబట్టి ఎమ్మెల్యేకి జనాలతో ఈజీ యాక్సెస్ ఉంది. మరలాంటి వంశీని ఓడించాలంటే మార్గమేంటి? అందుకనే నియోజకవర్గంలో ఎంట్రీ గ్రాండ్‌గా ఉండాలని తమ్ముడు అనుకున్నట్లున్నాడు.

ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే అప్పట్లో జగన్‌ను అమ్మనాబూతులు తిట్టినందుకు అరెస్టయ్యాడు. అయితే 24 గంటలు కూడా కస్టడీలో ఉండకుండా బెయిల్ పైన బయటకొచ్చేశాడు. అప్పటి నుండే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. తాను ఎవరిపైన ఎలా మాట్లాడినా ఇబ్బంది లేదని బెయిల్ తీసుకుని ఈజీగా బయటకు వచ్చేయన్నది తమ్ముడి నమ్మకం. అందుకనే ఇప్పుడు కూడా వంశీని తిట్టడంతో పాటు ఏకంగా గన్నవరం పార్టీ ఆఫీసు దగ్గరకు వైసీపీ శ్రేణులు వచ్చేట్లుగా బాగా రెచ్చగొట్టి కంపుచేశాడు. దాంతో అక్కడ ఎంత గొడవైందో అందరు చూసిందే.

అయితే పట్టాభి అనుకున్నట్లు ఈసారి బెయిల్ దొరకలేదు. 14 రోజుల రిమాండు విధించి రాజమండ్రి జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. బెయిల్ కోసం లాయర్ ఎంత వాదించినా లాభం లేకపోయింది. కోర్టు ఈ విధంగా ఆదేశిస్తుందని చంద్రబాబు అండ్ కో ఊహించుండరు. అరెస్టయితే జైల్లో కూర్చోవాల్సొస్తుందనే భయముంటే నోటిని అదుపులో పెట్టుకునుండేవాడే. అరెస్టయిన 24 గంటల్లోనే బెయిల్ వచ్చేస్తుందన్న ఓవర్ కాన్పిడెన్సే పట్టాభి కొంపముంచేసినట్లుంది.

First Published:  24 Feb 2023 9:04 AM IST
Next Story