గతి లేక టీడీపీకి ఓటేశామంటూ..భూమన కాళ్ల మీద పడ్డ కార్పొరేటర్లు
టీటీపీ నేతల బెదిరింపులతో తాము తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలలో టీడీపీకి ఓటు వేశామని తమను క్షమించాలని కార్పొరేటర్లు భూమన కాళ్ళు పట్టుకొని ఏడ్చిచారు
కూటమి నేతల బెదిరింపులతో తాము తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలలో టీడీపీకి ఓటు వేశామని తమను క్షమించాలని నలుగురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే భూమన ఇంటికి చేరుకుని కాళ్ల మీద పడి వేడుకున్నారు. బెదిరించి కూటమికి ఓట్లు వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు అయిందంటూ భూమన కాళ్లమీద పడి క్షమాపణ కోరారు. కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధికంగా ఇబ్బందులకు గురి చేస్తానంటే ఓటు వేశామని తెలిపారు. ఓటు వేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదర్కొంటారని భయపెట్టడంతో ఓటేశామని వారు తెలిపారు.
పశ్చాత్తాపంతో తమను క్షమించమని వేడుకుంటూ భూమన కరుణాకరరెడ్డిని మేం నలుగురం (కార్పొరేటర్లు) అనీష్, అనిల్, మోహన్ కృష్ణ యాదవ్, అమరనాథ్ రెడ్డిలు ప్రాధేయపడ్డాం. తామంతా వైఎస్సార్‌సీపీ అధినతే, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం కోరుకునే వాళ్ళమని, మమ్మల్ని భయపెట్టి, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరించి కిడ్నాప్ చేశారు.తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. మునికృష్ణకు 26 మంది, వైసీపీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డికి 21 మంది మద్దతు తెలిపారు. దీంతో మునికృష్ణ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.