తిరుమల రెండో ఘాట్‌లో డివైడర్‌ను ఢీకొన్న బస్సు
ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొనడంతో పలువురికి స్వల్ప గాయాలు
BY Raju Asari13 Jan 2025 4:09 PM IST
X
Raju Asari Updated On: 13 Jan 2025 4:09 PM IST
తిరుమల రెండో ఘాట్‌లో బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొనడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు రోడ్డుకు అడ్డంగా ఉండిపోయింది. క్రాష్ బారియర్ పటిష్టంగా ఉండటంతో బస్సు రోడ్డుపైనే నిలిచిపోయింది. లేకుంటే పక్కనే ఉన్న లోయలోకి బస్సు జారిపడే అవకాశం ఉండేది. అదృష్టవశాత్తు అలంటి ప్రమాదం జరగకపోవడంతో బస్సులో ప్రయాణిస్తున్న భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్‌లో కిలోమీటర వరకు వాహనాలు నిలిచిపోయాయి.అలిపిరి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. క్రేన్ సాయంతో బస్సును తొలిగించడానికి సిబ్బంది యత్నిస్తున్నది.
మరోవైపు తిరుమలలోని 47వ లడ్డూ కౌంటర్‌లో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. విద్యుదాఘాతం కారణంగా ఈ ఘటన జరిగింది. వెంటనే సిబ్బంది స్పందించి మంటలను ఆర్పివేశారు. దీంతో ప్రమాదం తప్పింది.
Next Story