Telugu Global
Andhra Pradesh

చిత్తూరులో గూండాగిరి.. అది ఫేక్ న్యూస్ అంటున్న టీడీపీ

చిత్తూరులో జరిగినట్టుగా చెబుతున్న వీడియో పర్సనల్ గొడవకి సంబంధించినది అని టీడీపీ అంటోంది. వైసీపీ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోందని మండిపడుతూ టీడీపీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఓ పోస్టింగ్ ఉంచింది.

చిత్తూరులో గూండాగిరి.. అది ఫేక్ న్యూస్ అంటున్న టీడీపీ
X

ఏపీలో ఎన్నికల అల్లర్లకు కొనసాగింపుగా ఇప్పుడు మరిన్ని గొడవలు జరుగుతున్నాయి. టీడీపీ రివేంజ్ పాలిటిక్స్ కి పాల్పడుతోందనేది వైసీపీ ఆరోపణ. వైసీపీవి తప్పుడు ఆరోపణలు అంటూ టీడీపీ కౌంటర్లిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో గొడవలు జరుగుతున్న ఏ వీడియో వైరల్ అయినా దానికి రాజకీయ పార్టీల రంగులేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. ఆ దాడికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తమ్ముడికి సంబంధం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో కూడా ఆ వీడియో పోస్ట్ చేసి విమర్శలు సంధించారు. దీంతో టీడీపీ రియాక్ట్ అయింది.


అది పర్సనల్ గొడవ..

చిత్తూరులో జరిగినట్టుగా చెబుతున్న వీడియో పర్సనల్ గొడవకి సంబంధించినది అని టీడీపీ అంటోంది. వైసీపీ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోందని మండిపడుతూ టీడీపీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఓ పోస్టింగ్ ఉంచింది. అది వ్యక్తిగత తగాదా వల్ల జరిగిన గొడవ అని, వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులని అరెస్ట్ చేశారని వివరించారు టీడీపీ నేతలు. ఈ ఘటనపై FIR కూడా నమోదైందని అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేకి కానీ, ఎమ్మెల్యే అనుచరులకి కానీ ఈ ఘటనతో సంబంధం లేదంటున్నారు.

ఏది నిజం..?

ఎక్కడ ఏ గొడవ జరిగినా ఫలానా పార్టీకి సంబంధం ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. బాధితులు ఫలానా పార్టీ వారని, దాడికి పాల్పడిన వారు ఫలానా పార్టీ అనుచరులని అంటున్నారు. ఏ ఇద్దరి మధ్య గొడవ జరిగినా రాజకీయం చేసేస్తున్నారు. తాజాగా చిత్తూరు గొడవ కూడా ఇలాగే రాజకీయాలకు కేంద్రబిందువైంది. దీనిపై వైసీపీ, టీడీపీ.. సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.

First Published:  19 Jun 2024 8:54 AM GMT
Next Story