నిన్న పోలింగ్.. నేడు ట్రోలింగ్
సహజంగా వైసీపీకి ఎప్పుడూ లోకేష్ ట్రోలింగ్ మెటీరియల్ అవుతారు. కానీ ఈసారి మాత్రం వారికి పవన్ బుక్కయ్యారు.
నిన్న ఏపీలో పోలింగ్ ముగిసినా, నేడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా పల్నాడు జిల్లా వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిన్న టీడీపీ అనుకూల సోషల్ మీడియా తెనాలి ఘటనను హైలైట్ చేసింది. నేడు దువ్వాడ శ్రీనివాస్ సెల్ ఫోన్ వీడియో వైరల్ చేస్తోంది. పోలింగ్ బూత్ లో వైసీపీ అభ్యర్థి దువ్వాడ సెల్ ఫోన్ మాట్లాడారని, ఇది నిబంధనలకు విరుద్ధం అని అంటున్నారు. సామాన్య ఓటర్లకు సెల్ ఫోన్ తో వస్తే నో ఎంట్రీ అని చెబుతున్న అధికారులు దువ్వాడ సెల్ ఫోన్ మాట్లాడుతున్నా చూస్తూ ఊరుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈరోజంతా దువ్వాడ వీడియో హైలైట్ అయ్యేలా ఉంది.
సోషల్ మీడియాలో ఎక్కువగా వైసీపీ నేతలే టార్గెట్ కావడం విశేషం. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య, తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వీడియోలు వైరల్ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆయా నేతలు వెళ్తున్న వీడియోలను పోస్ట్ చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
సహజంగా వైసీపీకి ఎప్పుడూ లోకేష్ ట్రోలింగ్ మెటీరియల్ అవుతారు. కానీ ఈసారి మాత్రం వారికి పవన్ బుక్కయ్యారు. ప్రింట్ రాదా అంటూ ఈవీఎం మీట నొక్కిన వెంటనే పవన్ కల్యాణ్ అన్న డైలాగ్ వైరల్ గా మారింది. పవన్ అవగాహనా స్థాయి అదీ అంటూ నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఇక టీడీపీ అభ్యర్థులు, వారి అనుచరుల ఓవర్ యాక్షన్.. అంటూ వైసీపీ కూడా కొన్ని వీడియోలను బయటపెట్టింది.
మొత్తమ్మీద నిన్న పోలింగ్ వీడియోలు, పోలింగ్ ట్రెండ్ తో సోషల్ మీడియా హోరెత్తగా.. ఈరోజంతా ట్రోలింగ్ సబ్జెక్ట్ హైలైట్ గా నిలిచే అవకాశముంది. వాళ్లని వీళ్లు, వీళ్లని వాళ్లు కామెంట్లు చేసుకుంటూ రెచ్చగొట్టే వీడియోలు పోస్ట్ చేసుకుంటున్నారు.