టీడీపీ టార్గెట్.. ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీ
ప్రకాశం జిల్లా ఎస్సీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అన్బురాజు, చిత్తూరు ఎస్పీ జాషువా, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్ రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజులను ఈసీ బదిలీ చేసింది. గతంలో కూడా టీడీపీ వారిని టార్గెట్ చేసింది.
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొంత మంది అధికారులను టీడీపీ టార్గెట్ చేసింది. వారిపై పదే పదే ఫిర్యాదు చేస్తూ వస్తోంది. ఆ కారణంగానే ఎన్నికల సంఘం ఆరుగురు ఎస్పీలను, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వారిపై టీడీపీ వివిధ ఆరోపణలు చేయడంతో పాటు వారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో వారిని ఎన్నికల విధుల నుంచి కూడా ఈసీ తప్పించింది.
ఆరుగురు ఐపీఎస్ అధికారుల్లో ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన ఓసీలు కాగా, మిగతా ముగ్గురు ఎస్సీలు. ముగ్గురు ఐఏఎస్ అధికారుల్లో ఇద్దరు ఎస్సీలు కాగా, ఒకరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. సామాజిక వర్గాలవారీగా అధికారులను టీడీపీ టార్గెట్ చేస్తోంది.
ప్రకాశం జిల్లా ఎస్సీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అన్బురాజు, చిత్తూరు ఎస్పీ జాషువా, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్ రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజులను ఈసీ బదిలీ చేసింది. గతంలో కూడా టీడీపీ వారిని టార్గెట్ చేసింది.
కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి, తిరుపతి ఎన్నికల అధికారి లక్ష్మీషాలను ఈసీ బదిలీ చేసింది. వారి కింది అధికారులకు బాధ్యతలను అప్పగించాలని ఆదేశించింది.