Telugu Global
Andhra Pradesh

జగన్‌ ఓడిపోయాడు కానీ.. అయ్యన్నపాత్రుడి వీడియో వైరల్‌

ఇటీవలి ఎన్నికల్లో జగన్‌ ఓడిపోయినప్పటికీ.. ఆయన తిరిగి నిలదొక్కుకుంటారన్న భయం ఆ ఇద్దరి వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపించింది.

జగన్‌ ఓడిపోయాడు కానీ.. అయ్యన్నపాత్రుడి వీడియో వైరల్‌
X

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుకు చెందిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అయ్యన్న పాత్రుడితో మాట్లాడుతూ ఓ టీడీపీ అభిమాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవలి ఎన్నికల్లో జగన్‌ ఓడిపోయినప్పటికీ.. ఆయన తిరిగి నిలదొక్కుకుంటారన్న భయం ఆ ఇద్దరి వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపించింది.



ఇంతకీ వీడియోలో ఏముందంటే?

జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు,

అతనికి అపారమైన జన బలం, కుల బలం ఉంది

తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్ గా ఉండే వారు ఉన్నారు.

నేను చెప్పింది కరెక్ట్ గా రిసీవ్ చేసుకోండి.. అంటూ అయ్యన్న పాత్రుడితో చెప్పారు సదరు సీనియర్ కార్యకర్త.


ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ అయ్యన్నపాత్రుడు సైతం మంచి పాయింట్ చెప్పారంటూ ఆ కార్యకర్తతో అంటారు. అంతే కాదు అతని మాటలకు మద్దతుగా ఈసారి జగన్‌ను సచ్చే వరకు కొట్టాలంటూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్‌కు ముప్పు తలపెట్టేలా టీడీపీ ఏదైనా ప్లాన్ చేస్తుందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

First Published:  14 Jun 2024 1:28 PM GMT
Next Story