34 మందితో టీడీపీ సెకండ్ లిస్ట్.. కనిపించని గంటా పేరు.?
పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, బీజేపీకి 10 స్థానాలు కేటాయించారు. మరో 16 స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది తెలుగుదేశం. మొదటి జాబితాలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు.. తాజా బాబితాలో 34 మందికి అవకాశం ఇచ్చారు. దీంతో 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, బీజేపీకి 10 స్థానాలు కేటాయించారు. మరో 16 స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తాజా లిస్టులో రాజమండ్రి రూరల్ నుంచి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ అవకాశం దక్కించుకున్నారు.
ఇక సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి ఈ సారి ఆత్మకూరు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి వెంకటగిరి నుంచి విజయం సాధించారు. శ్రీకాళహస్తి నుంచి దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అయితే తాజా లిస్టులోనూ ఉత్తరాంధ్ర కీలక నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు పేరు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.