Telugu Global
Andhra Pradesh

జగన్ ఏం చేశారు..? బాబు ఏం చేస్తున్నారు..? ఇవిగో లెక్కలు

అప్పుడు ప్రభుత్వం కుదురుకున్న తర్వాతే అన్ని పథకాలు అమలు చేశారని, తామిప్పుడు అధికారంలోకి వచ్చి నెలరోజులు కూడా కాకముందే ఎందుకీ విమర్శలంటూ బదులిచ్చారు టీడీపీ నేతలు.

జగన్ ఏం చేశారు..? బాబు ఏం చేస్తున్నారు..? ఇవిగో లెక్కలు
X

స్కూళ్లు మొదలయ్యాయి.. ఇంకా అమ్మఒడి ఇవ్వలేదు.

సాగు మొదలైంది.. ఇంకా రైతు భరోసా అందలేదు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలరోజులు గడుస్తున్నా.. సంక్షేమ పథకాలపై ఎందుకింత నిర్లక్ష్యం అంటూ వైసీపీ నేతలు లాజిక్ తీస్తున్నారు. ఆ పార్టీ అధినేత జగన్ కూడా ఇదే విషయంపై సూటిగా ప్రశ్నించారు. అమ్మఒడి సంగతేంటి, రైతుభరోసా ఎందుకు మరిచారు అంటూ నెల్లూరు పర్యటన సందర్భంగా ప్రశ్నల వర్షం కురిపించారు.


టీడీపీ సమాధానం ఏంటంటే..?

ఆత్రం, కంగారు ఎందుకు జగన్.. అంటూ టీడీపీ నుంచి కౌంటర్ పడింది. అమ్మఒడి, రైతు భరోసా గురించి ఆయన ఎందుకంత ఆత్రపడిపోతున్నారంటూ ఓ ట్వీట్ వేసింది. వైసీపీ హయాంలో ఎప్పుడు ఏ పథకం ఇచ్చారు, ఇప్పుడెందుకింత రాద్ధాంతం చేస్తున్నారంటూ సమాధానమిచ్చారు టీడీపీ నేతలు.


వైసీపీ 2019 జూన్ లో అధికారంలోకి వస్తే, అమ్మఒడి ఇచ్చింది 2020 జనవరిలో

వైసీపీ 2019 జూన్ లో అధికారంలోకి వస్తే, రైతు భరోసా ఇచ్చింది 2019 అక్టోబర్ లో

వైసీపీ 2019 జూన్ లో అధికారంలోకి వస్తే, వసతి దీవెన ఇచ్చింది 2020 ఫిబ్రవరిలో

వైసీపీ 2019 జూన్ లో అధికారంలోకి వస్తే, విద్యా దీవెన ఇచ్చింది 2020 ఏప్రిల్ లో

వైసీపీ 2019 జూన్ లో అధికారంలోకి వస్తే, సున్నా వడ్డీ ఇచ్చింది 2020 ఏప్రిల్ లో

వైసీపీ 2019 జూన్ లో అధికారంలోకి వస్తే, మత్స్యకార భరోసా ఇచ్చింది 2019 నవంబర్ లో

వైసీపీ 2019 జూన్ లో అధికారంలోకి వస్తే, నేతన్న నేస్తం ఇచ్చింది 2019 డిసెంబర్ లో..

అప్పుడు ప్రభుత్వం కుదురుకున్న తర్వాతే అన్ని పథకాలు అమలు చేశారని, తామిప్పుడు అధికారంలోకి వచ్చి నెలరోజులు కూడా కాకముందే ఎందుకీ విమర్శలంటూ బదులిచ్చారు టీడీపీ నేతలు.

ఏమేం చేశామంటే..?

కూటమి అధికారంలోకి వచ్చిన 10రోజుల్లోనే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచామని, దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేశామని, 16 వేల ఉద్యోగాలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని, దుర్మార్గపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, ఉచిత ఇసుక పాలసీ తీసుకొస్తున్నామని, అన్న క్యాంటీన్లు రెడీ అవుతున్నాయని టీడీపీ ట్విట్టర్లో సమాధానమిచ్చింది. పది రోజుల్లో ఇన్ని చేసిన తాము హామీలు నెరవేర్చలేమా..? అని టీడీపీ ప్రశ్నిస్తోంది.

First Published:  4 July 2024 10:34 AM GMT
Next Story