జగన్ పుట్టినరోజున టీడీపీ సైకోయిజం
ఇవాళ ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ పార్టీల నాయకులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పారు. రాజకీయంగా జగన్ తనకు బద్ధ శత్రువు అని చెప్పే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ కు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
ఎన్నికల సమయం వరకే రాజకీయంగా శత్రువులు. ఆ తర్వాత నాయకులందరూ కలిసి అభివృద్ధికి పాటుపడాలని చెబుతుంటారు. ఎంత ప్రత్యర్థులైనా.. రాజకీయపరంగా ఎన్ని విమర్శలు చేసుకుంటున్నా.. అనుకోకుండా ఒకే వేదికపైకి వస్తే నాయకులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటుంటారు. జన్మదినం వంటి ప్రత్యేక సందర్భాల్లో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం చూస్తుంటాం.
ఇవాళ ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ పార్టీల నాయకులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పారు. రాజకీయంగా జగన్ తనకు బద్ధ శత్రువు అని చెప్పే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ కు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
సైకో మేనమామకి ఆంధ్రాలో అభిమాన మేనల్లుళ్లు అందజేస్తున్న పుట్టినరోజు శుభాకాంక్షలు..
— Telugu Desam Party (@JaiTDP) December 21, 2023
హ్యాపీ బర్త్డే సైకో మాయ్య!#WhyAPHatesJagan #AndhraPradesh #PsychoJagan pic.twitter.com/doL3JyIx1O
కానీ, టీడీపీ మాత్రం జగన్ పుట్టినరోజున కూడా ఆయనపై శాపనార్థాలు పెట్టడం వదల్లేదు. హ్యాపీ బర్త్ డే సైకో మాయ్యా.. అంటూ వెకిలి చేష్టలకు దిగింది. జగన్ పట్ల వెకిలి చేష్టలకు పాల్పడుతూ ట్విట్టర్ వేదికగా టీడీపీ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
సైకో మేనమామకి ఆంధ్రాలో అభిమాన మేనల్లుళ్లు అందజేస్తున్న పుట్టినరోజు శుభాకాంక్షలు.. అంటూ పాట రూపంలో ఓ వీడియోను టీడీపీ విడుదల చేసింది. అందులో 'టాటా.. బైబై.. జగన్.. నువ్వు జైలుకెళ్లే టైమ్ వచ్చింది.. నీ దగా కోరుపాలనలో సచ్చాం.. నువ్వు తప్పకుండా చిప్పకూడు తింటావ్.. ఆ క్షణం పండుగైతది.. ఆంధ్ర బాగుపడతది. మా బాబు పాలనొస్తది. బాధలన్ని పోతవి' అంటూ ఆ పాట సాగింది.
టీడీపీ పోస్ట్ చేసిన ఈ వీడియోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాజకీయపరంగా ఎంత శత్రుత్వం ఉన్నా ఇలా వెకిలి వీడియోలు పోస్ట్ చేయడం తగదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. పచ్చ సైకోలు 14 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేశారంటూ మరికొందరు టీడీపీని విమర్శిస్తూ పోస్ట్ లు పెట్టారు.