Telugu Global
Andhra Pradesh

బాదుడే బాదుడు అట్టర్ ఫ్లాపేనా.. నివేదిక చెప్పిన మాట

ఎ గ్రేడ్‌లో ఒక్కటంటే ఒక్క నియోజకవర్గం కూడా లేదు. అంటే కుప్పం, టెక్కలి, మంగళగిరి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఏ ఒక్కటీ ఎ గ్రేడ్‌లో లేదు.

బాదుడే బాదుడు అట్టర్ ఫ్లాపేనా.. నివేదిక చెప్పిన మాట
X

చంద్రబాబు నాయుడు పార్టీ విస్తృత స్ధాయి సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవకపోతే ఎదురవబోయే పరిణామాలను వివరించారు. తమ్ముళ్ళు యాక్టివ్‌గా ఉండాల్సిన అవసరం ఏమిటో స్పష్టంగా చెప్పారు. తాను చేస్తున్న పోరాటాలు ఎవరి కోసమో వివరించారు. తర్వాత పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మను తమ్ముళ్ళకి పరిచయం చేశారు. తమ్ముళ్ళని ఉద్దేశించి రాబిన్ కూడా ఓ 20 నిమిషాలు మాట్లాడారు.

అంతా బాగానే ఉంది కానీ సమావేశం చివరలో ఒక నివేదికను ఒక అమ్మాయి చదివి వినిపించింది. ఇంతకీ ఆ నివేదికలో ఏముందంటే బాదుడే బాదుడు కార్యక్రమం జరిగిన తీరుపై విశ్లేషణ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రిస్టేజిగా తీసుకుని నిర్వహిస్తున్న గడప గడపకు మ‌న‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ఎలా జరిగిందనే విషయమై చంద్రబాబు క్షేత్ర స్ధాయి నుంచి నివేదికలు తెప్పించారు.

ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను వచ్చింది వచ్చినట్లుగా ఐటి విభాగం సిబ్బంది కంప్యూటర్‌లోకి ఎక్కించారు. దీని కోసమే ప్రత్యేకంగా రెడీ చేసిన సాఫ్ట్ వేర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చింది. ఆ గ్రేడింగ్ ఎ, బి, సి, డి అని నాలుగు రకాలుగా ఉంది. ఎ అంటే చాలా బాగా జరిగిందని, బి అంటే పర్వాలేదని, సి అంటే బాగా లేదని, డి అంటే అధ్వాన్నంగా ఉందని అర్ధం.

ఆ అమ్మాయి చదవిన గ్రేడింగ్ ప్రకారం 86 నియోజకవర్గాలకు డి గ్రేడింగ్ దక్కింది. అంటే ప్రోగ్రామ్ అధ్వాన్నంగా జరిగిందని. మరో 80 నియోజకవర్గాలు సి గ్రేడ్‌లో ఉన్నాయి. అంటే కార్యక్రమాలు బాగా జరగలేదని అర్ధం. అలాగే మరో 9 నియోజకవర్గాలు బి గ్రేడ్‌లో ఉన్నాయి. అంటే 9 నియోజకవర్గాల్లో ప్రోగ్రామ్ పర్వాలేదన్నట్లుగా జరిగిందని. ఎ గ్రేడ్‌లో ఒక్కటంటే ఒక్క నియోజకవర్గం కూడా లేదు. అంటే కుప్పం, టెక్కలి, మంగళగిరి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఏ ఒక్కటీ ఎ గ్రేడ్‌లో లేదు. పార్టీ రిలీజ్ చేసిన నివేదిక ప్రకారమే బాదుడే బాదుడు ప్రోగ్రామ్ అట్టర్ ఫ్లాప్ అని అర్ధమైపోతోంది.

First Published:  21 Nov 2022 12:10 PM IST
Next Story