చంద్రబాబులో ఇంత అయోమయమా..?
వలంటీర్ల వ్యవస్థ మొదలైనప్పుడు చంద్రబాబు విపరీతంగా విషం కక్కారు. వలంటీర్లు ఇళ్ళల్లోని ఆడవాళ్ళను ఇబ్బందులు పెడుతున్నారని కూడా ఆరోపించారు. తర్వాత ఏమైంది..? జనాల్లో వలంటీర్లపై బాగా నమ్మకం పెరిగింది.
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడులో అయోమయం రోజురోజుకు పెరిగిపోతోంది. ఏరోజు ఏమి మాట్లాడుతారో జనాలకు కాదు తమ్ముళ్ళకే అర్థం కావటంలేదు. విషయం ఏదైనా యూటర్నులు తీసుకోవటం ఎక్కువైపోతోంది. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రత్యేకహోదా విషయంలో మొదలైన యూటర్న్ తాజాగా వలంటీర్ల వ్యవస్ధ, సంక్షేమ పథకాలను కొనసాగించే విషయంలో కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్న నవరత్నాలపై వీలైనంతగా బురద చల్లేశారు. జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఏపీ మరో శ్రీలంకలా మారిపోతోందంటూ నానా యాగీ చేశారు.
తనకు మద్దతుగా ఎల్లోమీడియాలో కూడా పదే పదే వార్తలు రాయించుకున్నారు. టీవీల్లో అయితే వారాల తరబడి డిబేట్లు కూడా చేయించారు. సంక్షేమ పథకాలపై తాను వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల జనాల్లో టీడీపీపై వ్యతిరేకత పెరిగిపోతోందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. దాంతో సంక్షేమ పథకాలపై మాట్లాడటం మానేశారు. తర్వాత కొంతకాలానికి తాను అధికారంలోకి వస్తే ఇప్పటికన్నా మెరుగ్గా మరింత ఎక్కువగా పథకాలు అమలుచేస్తానంటు యూటర్న్ తీసుకున్నారు.
వలంటీర్ల వ్యవస్థ మొదలైనప్పుడు చంద్రబాబు విపరీతంగా విషం కక్కారు. వలంటీర్లు ఇళ్ళల్లోని ఆడవాళ్ళను ఇబ్బందులు పెడుతున్నారని కూడా ఆరోపించారు. తర్వాత ఏమైంది..? జనాల్లో వలంటీర్లపై బాగా నమ్మకం పెరిగింది. వలంటీర్ల సేవల విషయంలో మెజారిటీ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. దాంతో జనాల మనోభావాలు అర్ధమై తర్వాత మాట్లాడటం మానుకున్నారు. ఇప్పుడు వలంటీర్లను తొలగిస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని కంటిన్యూ చేస్తానన్నారు.
ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లిషు మీడియంపై విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేసిన చంద్రబాబు తర్వాత రూటు మార్చారు. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లిషుమీడియంను ప్రవేశపెట్టిందే తానంటూ రివర్సులో మొదలుపెట్టారు. ఎందుకంటే ఇంగ్లిషుడియం విషయంలో జనాలు సానుకూలంగా ఉన్నారని అర్ధమైపోయింది. ఆ మధ్య కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరుపెట్టే విషయంలో ముందు సరే అన్నారు. తర్వాత వ్యతిరేకించి మళ్ళీ మద్దతు పలికారు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రత్యేకహోదాపై ఎన్నిసార్లు పిల్లిమొగ్గలు వేశారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఏ విషయంలో అయినా ఇంత అయోమయం ఎందుకొస్తోందో అర్ధంకావటంలేదు.