పార్టీలో కష్టపడిన వారికే ప్రాధాన్యం.. చంద్రబాబు లాజిక్ ఏంటి..?
ఎమ్మెల్యేల కొనుగోలుపై వైసీపీ పిచ్చి ప్రేలాపనలు ఆపాలన్నారు టీడీపీ నేతలు. సైకిల్ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నాడో జగన్ చెప్పాలని ప్రశ్నించారు.
ఓవైపు చేరికలతో పార్టీ బలం పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నారు, మరోవైపు పార్టీలో కష్టపడినవారికే ప్రాధాన్యముంటుందని చెబుతున్నారు. ఇంతకీ చంద్రబాబు లాజిక్ ఏంటి..? యువతకు 40శాతం సీట్లు ఇస్తామంటున్నారు, మరోవైపు టీడీపీ సీనియర్లెవరూ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు రావడంలేదు.. ఇంతకీ చంద్రబాబు ఏం చేస్తారు..? తాజాగా జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో టీడీపీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు @ncbn గారి అధ్యక్షతన హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పొలిట్ బ్యూరో సభ్యులు హాజరై వివిధ అంశాలపై చర్చించారు.#NCBN #TDPforDevelopment pic.twitter.com/1M6PO51oK7
— Telugu Desam Party (@JaiTDP) March 28, 2023
ఏపీకి సంబంధించిన 13 అంశాలు, తెలంగాణకు చెందిన 4.. మొత్తం 17 అంశాలపై టీడీపీ పోలిట్ బ్యూరోలో చర్చ జరిగినట్టు తెలిపారు నేతలు. మార్చి-29న టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. రేపు మధ్యాహ్నం 3 గంలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించబోతున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రేపటి నుంచి మే 28వరకు వివిధ ప్రదేశాల్లో 100 సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 42పార్లమెంట్ నియోజకవర్గాల్లో శతజయంతి ఉత్సవాలు జరపాలని నిర్ణయించారు.
మోదీకి ధన్యవాదాలు..
ఎన్టీఆర్ ముఖ చిత్రంలో 100 రూపాయల నాణేన్ని విడుదల చేస్తోన్న కేంద్రానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలుతెలుపుతూ పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది. ఏపీ విషయానికొస్తే వైసీపీ పాలన దారుణంగా ఉందంటున్నారు నేతలు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగం విషయంలో సీఎం జగన్ కనీసం సమీక్ష జరపకపోవటం దుర్మార్గం అని అన్నారు. జీవో నెంబర్-1 విషయంలో జగన్ తన తప్పు ఒప్పుకోవాలని, జీవో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొన్నది ఎవరు..?
ఎమ్మెల్యేల కొనుగోలుపై వైసీపీ పిచ్చి ప్రేలాపనలు ఆపాలన్నారు టీడీపీ నేతలు. సైకిల్ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నాడో జగన్ చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోందన్నారు. 5 వేల రూపాయలకు టీడీపీ శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని పోలిట్ బ్యూరోలో నిర్ణయించినట్టు తెలిపారు.