టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
తెలుగు దేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. దీనిపై ఆ పార్టీ పోలీసులకు పిర్యాదు చేసింది.
BY Telugu Global1 Oct 2022 5:04 PM IST
X
Telugu Global Updated On: 1 Oct 2022 5:04 PM IST
తెలుగుదేశం పార్టీ (TDP) అధికారిక ట్విట్టర్ ఖాతా శనివారం హ్యాక్ అయ్యింది. ట్విట్టర్ హ్యాండిల్‌లో టీడీపీ స్థానంలో 'టైలర్ హాబ్స్' పేరు రావడంతో అకౌంట్ హ్యాక్ అయినట్లు టీడీపీ నిర్ధారణకు వచ్చింది. టీడీపీ పోస్టులకు బదులు విజువల్ ఆర్ట్స్ కు సంబంధించిన పలు పోస్టులు పోస్ట్ చేశారు.
ఈ దుశ్చర్య వెనుక వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల హస్తం ఉందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. "మేము ఫిర్యాదును నమోదు చేసాము. అతి త్వరలో ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించబడుతుంది" అని వారు చెప్పారు. గతంలో కూడా సైబర్ మోసగాళ్లు టీడీపీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి కొన్ని గంటల తర్వాత పునరుద్ధరించారు.
అయితే ఇది అంతర్జాతీయ హ్యాకర్ల పనా లేక లోకల్ గా టీడీపీ వ్యతిరేకులు చేసిన పనా అనేది తేలాల్సి ఉంది. అంతర్జాతీయ హ్యాకర్లు ప్రపంచంలో వీక్ లింక్ ఉన్న అనేక అకౌంట్లను హ్యాక్ చేయడం పరిపాటి.
Next Story