ఒకే రాజధాని అని నిత్యానందరాయ్ చెప్పారు- టీడీపీ ఎంపీలు
కేంద్రమంత్రి నిత్యానందరాయ్ సానుకూలంగా స్పందించారని, డీజీపీతో మాట్లాడుతానని హామీ ఇచ్చారని ఎంపీలు వెల్లడించారు. ఏ రాష్ట్రానికైనా ఒకటే రాజధాని ఉంటుందని.. ఇలా మూడు రాజధానులు ఉండవని వ్యాఖ్యానించారని కూడా టీడీపీ ఎంపీలు చెప్పారు.
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రబాబులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌కి ఫిర్యాదు చేశారు. అమరావతి పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని వారు ఫిర్యాదు చేశారు. తణుకులో నిన్న అడ్డంకులు సృష్టించినా ఏపీ పోలీసులు నిలువరించడంలో విఫలమయ్యారని వారు ఆరోపించారు. ఏపీ పోలీసులు విఫలమవుతున్నారు కాబట్టి రక్షణ కల్పించాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఫిర్యాదు చేశారు. యాత్రలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాబట్టి తక్షణం జోక్యం చేసుకోవాలని ఎంపీలు కోరారు.
కేంద్రమంత్రి నిత్యానందరాయ్ సానుకూలంగా స్పందించారని, డీజీపీతో మాట్లాడుతానని హామీ ఇచ్చారని ఎంపీలు వెల్లడించారు. ఏ రాష్ట్రానికైనా ఒకటే రాజధాని ఉంటుందని.. ఇలా మూడు రాజధానులు ఉండవని వ్యాఖ్యానించారని కూడా టీడీపీ ఎంపీలు చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో కేవలం వాతావరణ పరిస్థితుల రిత్యా రెండు చోట్ల రాజధానులు ఏర్పాటు చేశారే గానీ మరెక్కడా అలాంటి పరిస్థితి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్పారని ఎంపీలు మీడియాకు చెప్పారు.