టీడీపీ ఎమ్మెల్యేకి 6 నెలల జైలు
విశాఖపట్టణానికి చెందిన బోర రామచంద్రారెడ్డి, దుర్గారెడ్డికి మధ్య ఆస్తుల విషయంలో విభేదాలు ఉన్నాయి. వారి మధ్య 2006 నుంచి కేసులు నడుస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం శుక్రవారం తీర్పు చెప్పింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌కు 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ విశాఖ రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది.
విశాఖపట్టణానికి చెందిన బోర రామచంద్రారెడ్డి, దుర్గారెడ్డికి మధ్య ఆస్తుల విషయంలో విభేదాలు ఉన్నాయి. వారి మధ్య 2006 నుంచి కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో 2008 అక్టోబర్ 29న వాసుపల్లి గణేశ్‌కుమార్, దుర్గారెడ్డి కలిసి రామచంద్రారెడ్డిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో రామచంద్రారెడ్డి వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు విచారణలో నేరం రుజువు కావడంతో ఎమ్మెల్యే గణేశ్ కుమార్, దుర్గారెడ్డిలకు న్యాయస్థానం పైతీర్పు వెలువరించింది.