Telugu Global
Andhra Pradesh

కోర్టు నోటీసులనూ రెజెక్ట్ చేస్తున్నారా..?

ఎవరో నోటీసులు జారీకాకుండా అడ్డుకుంటున్నారని జడ్జికి అర్థ‌మైంది. అందుకనే పిటీషన్ దారుడైన ఉండవల్లి లాయర్‌కే నోటీసులు జారీచేసే బాధ్యతను అప్పగించారు.

కోర్టు నోటీసులనూ రెజెక్ట్ చేస్తున్నారా..?
X

స్కిల్ స్కామ్ దర్యాప్తును సీబీఐకి అప్పగించే విషయంలో కోర్టు తరఫున జారీచేస్తున్ననోటీసులను అందుకోవటానికి కొందరు నిరాకరిస్తున్నారా..? కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాయర్ చెప్పింది విని కోర్టు కూడా ఆశ్చర్యపోయింది. గడచిన రెండు విచారణల సందర్భంగా 45 మంది ప్రతివాదులకు నోటీసులు అందించమని న్యాయ‌మూర్తి ఆదేశించారు. ఆ తర్వాత నెలలో జరిగిన విచారణలో నిందితులకు నోటీసులే జారీకాలేదని తెలుసుకుని షాక్ అయ్యారు.

ఎవరో నోటీసులు జారీకాకుండా అడ్డుకుంటున్నారని జడ్జికి అర్థ‌మైంది. అందుకనే పిటీషన్ దారుడైన ఉండవల్లి లాయర్‌కే నోటీసులు జారీచేసే బాధ్యతను అప్పగించారు. అయితే బుధవారం జరిగిన విచారణలో ఇదే విషయమై చర్చ జరిగింది. ఉండవల్లి తరఫు లాయర్ మాట్లాడుతూ.. నోటీసులను అందుకోవటానికి కొందరు నిరాకరిస్తున్నట్లు చెప్పారు. నోటీసులు అందించేందుకు ఇంటికి వెళ్ళినప్పుడు డోర్‌ లాక్, ఇంట్లో లేరన్న సమాధానాలు వస్తున్నట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న మరికొందరు నోటీసులను తీసుకోవటానికి నిరాకరిస్తున్నట్లు కూడా ఆరోపించారు.

అందుకనే వాట్సప్, సోషల్ మీడియా, పత్రికల్లో ప్రకటన ద్వారా నిందుతులకు సమాచారం అప్పగించేందుకు అనుమతించాలని రిక్వెస్టు చేశారు. అందుకు కోర్టు అనుమతించింది. ఇక్కడ విషయం ఏమిటంటే.. స్కిల్ స్కామ్ విచారణను సీబీఐకి అప్పగించటాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళే నోటీసులు తీసుకోవటానికి నిరాకరిస్తున్నట్లు అర్థ‌మైపోతోంది. స్కామ్‌ను సీబీఐ విచారిస్తే ఎవరికి ఇబ్బందన్నది కీలకమైన ప్రశ్న. ఇప్పటికే సీబీఐ లేదా ఈడీ విచారణకు ప్రభుత్వం ఓకే చెప్పిన విషయం తెలిసిందే.

ఏ కోణంలో చూసినా సీబీఐ విచారణను వ్యతిరేకిస్తున్నది చంద్రబాబు నాయుడే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే.. సీబీఐ విచారణను కోరుతూ కోర్టులో పిటీషన్ వేయగానే టీడీపీ నేతలు ఉండవల్లిని దారుణంగా టార్గెట్ చేశారు. కాబట్టి సీబీఐ విచారణను వ్యతిరేకిస్తున్నది టీడీపీ అనే అనుకోవాలి. టీడీపీ అంటే చంద్రబాబు మాత్రమే అని ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు సీబీఐ విచారణ విషయంలో చంద్రబాబు నోరెత్తకపోవటం కూడా చాలామందికి అనుమానాలను పెంచేస్తోంది. చివరకు కోర్టు ఏమంటుందో చూడాలి.

First Published:  14 Dec 2023 11:02 AM IST
Next Story