జనసేన నేతలకు అవమానం.. టీడీపీ అరాచకం
టికెట్లు దక్కించుకున్న టీడీపీ నేతలు కొన్నిచోట్ల జనసేన నేతల్ని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం పుండు మీద కారం చల్లినట్టు ప్రవర్తిస్తున్నారు.
పొత్తు బంధం అంటే ఏంటి..? అవసరమైతే సీటు త్యాగం చేయాలి, సీటు తమకే వస్తే.. మిగతా వారిని కలుపుకొని వెళ్లాలి. కానీ టీడీపీ నేతలు మాత్రం ఏపీలో అరాచకం సృష్టిస్తున్నారని తెలుస్తోంది. జనసేన నేతలకు సీట్లు రాని చోట వారిని రెచ్చగొడుతూ, ఎగతాళి చేస్తూ అరాచకం సృష్టిస్తున్నారు. తాజాగా శ్రీకాళహస్తిలో ఇలాంటి ఉదంతం జరిగింది. కూటమి కట్టక ముందే ఇక్కడ జనసేన నేత కోట వినుత విస్తృతంగా ప్రచారం చేశారు, నిత్యం జనంలోనే ఉన్నారు. జనసేన, టీడీపీ కలయిక తర్వాత తనకు సీటు రాదని ఆమెకు అర్థమైంది, అందుకే కొన్నిరోజులుగా ఆమె సైలెంట్ గా ఉంటున్నారు. టీడీపీ సెకండ్ లిస్ట్ లో ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ దక్కడంతో ఆయన అనుచరులు జనసేన నేతల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. జనసేన నాయకురాలు కోట వినుత ఇంటి ముందు రచ్చ చేశారు.
Admin Post : -
— Vinutha Kotaa (@VinuthaKotaa) March 15, 2024
ఎమ్మెల్యే సీటు రాలేదని దుఃఖం లో ఉన్న జనసేన శ్రీకాళహస్తి ఇంఛార్జి వినుత కోటా గారి ఇంటి ముందు టీడీపీ అనుచరులు ఇంఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి కి వచ్చిందని వినుత గారి ఇంటి ముందు టపాసులు పేల్చి రాక్షస ఆనందం పొందడం నీచాతి నీచం.పార్టీ ఆఫీస్ వద్ద ఉన్న మహిళలపై , జనసైనికుల… pic.twitter.com/fbEmcmCNB2
టికెట్లు దక్కించుకున్న టీడీపీ నేతలు కొన్నిచోట్ల జనసేన నేతల్ని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం పుండు మీద కారం చల్లినట్టు ప్రవర్తిస్తున్నారు. శ్రీకాళహస్తిలో జరిగిన సంఘటన కూడా ఇలాంటిదే. ఎమ్మెల్యే సీటు రాలేదని బాధలో ఉన్న తన ఇంటి ముందు టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు టపాసులు పేల్చారని, రాక్షసానందం పొందేదుకే ఇలా చేశారని స్వయానా వినుత సోషల్ మీడియా ద్వారా దుమ్మెత్తి పోశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
బాధలో ఉన్న తమ ఇంటి ముందు టపాసులు కాల్చి రాక్షసానందం పొందడం నీఛాతి నీఛం అంటూ జనసేన నాయకురాలు వినుత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్న మహిళలు, జనసైనికులపై కూడా బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు దాడికి దిగారని ఆరోపించారు. కొన్నిచోట్ల టీడీపీ నేతలకు టికెట్లు రాకపోయినా అల్లర్లకు దిగుతున్నారు. టీడీపీకి టికెట్లు దక్కిన చోట ఇలా జనసేన నేతల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే, ఇక పొత్తు ధర్మం ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు. పవన్ కల్యాణ్ ఈ విషయంపై దృష్టి పెట్టాలని, టీడీపీ నేతల్ని అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబుకి సూచించాలని సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. మొత్తమ్మీద కూటమి కుదిరినా ఆ మూడు పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ ఫర్ మాత్రం అసాధ్యం అని తేలిపోయింది. రాగా పోగా ఈ కూటమి వల్ల వైసీపీ అంతిమంగా లాభపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.