అందరూ తిరగబడేవాళ్ళేనా?
వైసీపీ నేత ఎస్సీవీ నాయుడు గురువారం టీడీపీలో చేరాలి. అయితే నాయుడు పార్టీలో చేరుతున్న విషయం బొజ్జల సుధీర్ రెడ్డికు తెలియదట. అందుకనే నాయుడు చేరికపై ఒక ఆడియో మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ చంద్రబాబుకు కూడా చేరింది. దాంతో ఎందుకొచ్చిన తలనొప్పి అని నాయుడు చేరికను బాబు వాయిదా వేశారు.
చంద్రబాబు పరిస్థితి మరీ దయనీయంగా తయారైపోతోంది. పేరుకు పార్టీ అధినేతే కానీ ప్రతి ఒక్కరూ థిక్కరించేవాళ్ళే. చాలా మంది నేతలు చంద్రబాబు నిర్ణయానికి ఎదురుతిరుగుతున్నారు. అయినా ఏ ఒకరిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందో అన్న భయమే చంద్రబాబు పరిస్థితి ఇంతగా దిగజారిపోవటానికి కారణమైంది. తాజాగా శ్రీకాళహస్తిలో ఇన్‌చార్జి బొజ్జల సుధీర్ రెడ్డి దెబ్బకు చంద్రబాబు బెదిరిపోయారు. బొజ్జల వార్నింగ్ దెబ్బకు గురువారం జరగాల్సిన ఎస్సీవీ నాయుడు చేరిక ఆగిపోవటమే నిదర్శనం.
విషయం ఏమిటంటే గురువారం నాడు వైసీపీ నేత ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరాలి. నాయుడు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ అన్నీపార్టీలు చుట్టేశారు. అన్నీచోట్లా తిరిగి చివరకు టీడీపీ దగ్గరకే వచ్చారు. అయితే నాయుడు పార్టీలో చేరుతున్న విషయం బొజ్జలకు తెలియదట. అందుకనే నాయుడు చేరికపై ఒక ఆడియో మెసేజ్ పెట్టాడు.. నాయుడు టీడీపీలో చేరుతున్న విషయం తనకు తెలియదు కాబట్టి ఆ కార్యక్రమానికి నేతలు, మద్దతుదారులు ఎవరు హాజరుకావద్దు అన్నాడు. ఈ మెసేజ్ చంద్రబాబుకు కూడా చేరింది.
దాంతో ఎందుకొచ్చిన తలనొప్పి అని నాయుడు చేరికను వాయిదా వేశారు. 14వ తేదీన బొజ్జల, నాయుడును కుప్పం రమ్మని ఆదేశించారు. నిజానికి బొజ్జల స్థాయి చాలా చిన్నది. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకనే ఐడెంటి తప్ప ఇంకేమీలేదు. అలాంటి బొజ్జల ఆడియోకే చంద్రబాబు బెదిరిపోవటం విచిత్రంగా ఉంది.
ఇక్కడ గమనించాల్సిందేమంటే విజయవాడ ఎంపీ కేశినేని నాని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మరో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా చంద్రబాబును లెక్కేచేయటం లేదు. డోన్‌లో కేఈ ప్రతాప్ అయితే చంద్రబాబు మాటలకు విలువే ఇవ్వటంలేదు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా బాబు నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. సత్తెనపల్లిలో కోడెల శివరామ్ కుడా చంద్రబాబు ఆదేశాలను లెక్కచేసేదిలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. క్రమశిక్షణ తప్పిన నేతలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించటం తప్ప చంద్రబాబు ఇంకేమీ చేయలేకపోతున్నారు. అందుకనే నేతలంతా చంద్రబాబు నిర్ణయాలపై తిరగబడుతున్నారు. ఇప్పుడే ఇలాగుంటే ముందు ముందు ఇంకెలాగుంటుందో?