Telugu Global
Andhra Pradesh

టీడీపీలో ‘కన్నా’ చిచ్చు మొదలైపోయిందా?

మామూలుగా అయితే కన్నా నాలుగు సార్లు గెలిచింది పెదకూరపాడు నుండి.. ఒకసారి గుంటూరు వెస్ట్ లో కూడా గెలిచారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే విషయంలో క్లారిటి లేకపోవటంతో తమ్ముళ్ళందరు ఇబ్బందులు పడుతున్నారట.

టీడీపీలో ‘కన్నా’ చిచ్చు మొదలైపోయిందా?
X

చేరింది ఇప్పుడే అయినా తెలుగుదేశం పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ చిచ్చు మొదలైపోయిందట. పైగా ఒక నియోజకవర్గంలో కాదు ఏకంగా మూడు నియోజకవర్గాల్లో తమ్ముళ్ళంతా డిస్ట్రబ్ అయిపోతున్నారట. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచక అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే కన్నా చేరిక కారణంగా గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాల్లో సీనియర్లందరూ అయోమయంలో పడిపోయారట.

దీనికి ప్రధాన కారణం ఏమిటంటే కన్నా ఎక్కడి నుండి పోటీ చేస్తారో తెలియ‌కపోవటమే. మామూలుగా అయితే కన్నా నాలుగు సార్లు గెలిచింది పెదకూరపాడు నుండి.. ఒకసారి గుంటూరు వెస్ట్ లో కూడా గెలిచారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే విషయంలో క్లారిటి లేకపోవటంతో తమ్ముళ్ళందరు ఇబ్బందులు పడుతున్నారట. ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్నారు. కొందరికి టికెట్ హామీ కూడా లభించింది. ఇలాంటి సమయంలో హఠాత్తుగా కన్నా ఎంట్రీ అందరినీ ఇరుకునపడేస్తోందట.

పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌కే టికెట్ అనుకుంటున్నారు. ఈయనకు రాయపాటి అరుణ పోటీ ఇస్తోంది. అయితే రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి శ్రీధర్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. అయితే హఠాత్తుగా కన్నా రాకతో సమీకరణలు మారిపోతున్నాయట. ఇక గుంటూరు వెస్ట్ తీసుకుంటే టికెట్ హామీతో ఇక్కడ కోవెలమూడి రవీంద్ర ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. పొత్తుంటే తెనాలి సీటును జనసేనకు ఇచ్చేస్తే వెస్ట్ నుండి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కన్నా పేరు కూడా వినబడుతోంది. దాంతో సీనియర్లలో ఒక్కసారిగా అలజడి పెరిగిపోయింది.

ఇవి సరిపోవన్నట్లు సత్తెనపల్లిలో కూడా కన్నా పేరు వినిపిస్తోంది. ఇప్పటికే కోడెల శివరామ్, రాయపాటి రంగారావు, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, అబ్బూరి మురళి మధ్య రేస్ నడుస్తోంది. ఇప్పుడు వీళ్ళకి కన్నా కూడా తోడయ్యారు. విచిత్రం ఏమిటంటే జనసేనతో పొత్తుంటే ఒక నియోజకవర్గంలో.. లేకపోతే మరో నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. ఇన్ని ప్రచారాలతో సీనియర్లు ఇబ్బందులు పడేబదులు కన్నా ఎక్కడి నుండి పోటీ చేస్తారనే విషయమై క్లారిటి ఇవ్వమంటే చంద్రబాబునాయుడు ఏమీ మాట్లాడటంలేదట. మరీ కన్ఫ్యూజన్ ఎప్పటికి క్లియర్ అవుతుందో ఏమో.

First Published:  5 March 2023 11:39 AM IST
Next Story