వైసీపీలోకి యనమల.. టీడీపీకి బిగ్‌షాక్
అన్ని కుదిరితే ఈ నెల 16 లేదా 17 తేదీల్లో ఆయన వైసీపీలో చేరతారని సమాచారం. ముద్రగడ పద్మనాభం, యనమల కృష్ణుడు ఒకేసారి వైసీపీ కండువా కప్పుకుంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగలనుంది. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారని తెలుస్తోంది. తుని తెలుగుదేశం అభ్యర్థిగా యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్యను ఎంపిక చేయడంతో కృష్ణుడు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం.
యనమల కృష్ణుడు త్వరలోనే వైసీపీలో చేరతారని తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ నెల 16 లేదా 17 తేదీల్లో ఆయన వైసీపీలో చేరతారని సమాచారం. ముద్రగడ పద్మనాభం, యనమల కృష్ణుడు ఒకేసారి వైసీపీ కండువా కప్పుకుంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
పార్టీలోకి కృష్ణుడి చేరికపై దాడిశెట్టి రాజాతో వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. తనకు అభ్యంతరం లేదని దాడిశెట్టి చెప్పడంతో కృష్ణుడి చేరికకు జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే యనమల కృష్ణుడితో మంత్రి దాడిశెట్టి రాజా, కన్నబాబు చర్చలు జరిపినట్లు సమాచారం. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన 60 వేలకు పైగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఈ రెండు ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా విజయం సాధించారు.