Telugu Global
Andhra Pradesh

జనవరి నుంచి నారా లోకేష్ పాదయాత్ర

చిత్తూరు జిల్లా నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా వరకు యాత్ర కొనసాగిస్తారు. మొత్తం 450 రోజుల పాటు యాత్ర చేయాలని నారా లోకేష్ నిర్ణయించుకున్నారు.

జనవరి నుంచి నారా లోకేష్ పాదయాత్ర
X

టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రకు సిద్దమవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారని టీడీపీ మీడియా చెబుతోంది. ఈ విషయాన్ని టీడీపీ వర్గాలు ధృవీకరించినట్టు కథనం. సంక్రాంతి తర్వాత పాదయాత్రను ప్రారంభించి 2024 మార్చి వరకు యాత్ర కొనసాగించాలని నారా లోకేష్ భావిస్తున్నట్టు చెబుతున్నారు.

చిత్తూరు జిల్లా నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా వరకు యాత్ర కొనసాగిస్తారు. మొత్తం 450 రోజుల పాటు యాత్ర చేయాలని నారా లోకేష్ నిర్ణయించుకున్నారు. అక్టోబర్‌ నుంచే మొదలుపెట్టాలని తొలుత అనుకున్నా.. వచ్చే ఏడాది నుంచి మొదలుపెడితే ఎన్నికల వరకు యాత్రను చేసినట్టు ఉంటుంది.. ప్రజల్లో తిరిగినట్టు అవుతుందన్న ఉద్దేశంతోనే జనవరి నుంచి యాత్రకు లోకేష్ సిద్ధమైనట్టు చెబుతున్నారు.

పాదయాత్రను వారంలో ఏడు రోజుల పాటూ చేయాలని లోకేష్ భావిస్తున్నారని టీడీపీ మీడియా కథనం. తొలుత పాదయాత్ర చేసి వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా పాదయాత్ర చేసి సీఎంగా మళ్లీ గెలిచారు. జగన్ సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండడంతో జగన్‌ వారంలో ఐదు రోజుల పాటు యాత్ర చేసేవారు. కానీ తాను వారంలో ఏడు రోజులూ పాదయాత్ర చేసి జగన్‌ కంటే ఎక్కువ కష్టపడ్డారన్న భావన కలిగించాలని లోకేష్ భావిస్తున్నట్టు చెబుతున్నారు.

First Published:  18 Sept 2022 10:22 AM IST
Next Story