`నా బట్టలు చించిన పోలీసులకు బట్టలు ఉండవు`
తన చొక్కా పోలీసులు చించేసి దాడి చేశారని ఆరోపించిన చింతమనేని అదే చొక్కాతో టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. మీడియాతో మాట్లాడి తనపై పోలీసులు చేసిన దాడి గురించి వివరించారు.
`నా బట్టలు చించిన పోలీసులకు రేపు బట్టలుంటాయా..?` అంటూ టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ హెచ్చరిక ధోరణిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికే నాపై 31కేసులు పెట్టారు, నేను అన్నింటికీ తెగించి ఉన్నానని దురుసుగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి తాత దిగొచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరని ఊగిపోయారు చింతమనేని. నా పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు నా గుడ్డలు చించేశారని, ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, అత్యుత్సాహం చూపిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండంటూ హెచ్చరించారు.
తన చొక్కా పోలీసులు చించేసి దాడి చేశారని ఆరోపించిన చింతమనేని అదే చొక్కాతో టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. మీడియాతో మాట్లాడి తనపై పోలీసులు చేసిన దాడి గురించి వివరించారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా దెందులూరు లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశానని, ఈ ప్రాంగణానికి వచ్చిన పోలీసులు ఏర్పాట్లు అడ్డుకున్నారని చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. తనపై దాడి చేసి చొక్కా చించేసి ఏలూరుకి తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు.