జడ్జి ముందు అబద్దాలు చెప్పండి, కేసు ఎగిరిపోతుంది- టీడీపీ నేత చెంగల్రాయుడు
న్యాయమూర్తి ముందు నొప్పిగా ఉందని యాక్షన్ చేస్తే.. అప్పుడు పోలీసు నా కొడుకుల ఖాకీ బట్టలు ఊడిపోతాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి సమక్షంలోనే ఆ పార్టీ సీనియర్ నేత చెంగల్రాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. న్యాయమూర్తుల సమక్షంలో అబద్దాలు చెప్పాలని టీడీపీ కార్యకర్తలకు సూచించారు. ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దెత్తున అసత్యప్రచారానికి దిగుతున్న నేపథ్యంలో కేసులు నమోదు అవుతున్నాయి. కొందరిని అరెస్ట్ కూడా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ''పోలీసు నా కొడుకులు ఫోన్ చేస్తే రికార్డు చేయండి'' అంటూ కార్యకర్తలకు చెంగల్రాయుడు సూచించారు. పోలీసులను భయపెట్టేలా ఎదురుదాడి చేయాలన్నారు. అరెస్ట్ చేసి పోలీసులు కోర్టుకు తీసుకెళ్తే .. ఆ సమయంలో చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అని న్యాయమూర్తి అడుగుతారని.. అప్పుడు పోలీసులు విపరీతంగా కొట్టారని, కొట్టరాని చోట కొట్టారని, చాలా నొప్పిగా ఉందంటూ చెప్పాలని సూచించారు. అలా చెబితే కేసు గాల్లో కలిసిపోతుందని బహిరంగ వేదిక మీద నుంచే కార్యకర్తలకు సలహాలు, సూచనలు చేశారు చెంగల్రాయుడు.
న్యాయమూర్తి ముందు నొప్పిగా ఉందని యాక్షన్ చేస్తే.. అప్పుడు పోలీసు నా కొడుకుల ఖాకీ బట్టలు ఊడిపోతాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.