జూనియర్‌పై నాలుక మడతేసిన బుద్దా వెంకన్న
ఇదే బుద్దా వెంకన్న.. గతంలో భువనేశ్వరిని వైసీపీ నేతలు దూషించారంటూ ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌పై విరుచుకుపడ్డారు. సింహాద్రిలా పెద్ద గొడ్డలి తీసుకుని వస్తాడనుకుంటే చాగంటి ప్రవచనాలు చెబుతున్నాడంటూ తిట్టారు.
బుద్దా వెంకన్న నాలుక మడతేశారు. జూ.ఎన్టీఆర్‌పై యూ టర్న్ తీసుకున్నారు. అమరావతి పాదయాత్రలో కొందరు మహిళలు జూ.ఎన్టీఆర్ ఉంటే ఎంత..? పోతే ఎంత.. టీడీపీని మేమే కాపాడుకుంటామంటూ విమర్శించిన వీడియో బాగానే వైరల్ అయింది.
ఈ అంశాన్నే కొడాలి నాని ప్రస్తావించారు. జూ.ఎన్టీఆర్ ఏం తప్పు చేశారని.. అమరావతి మహిళలతో తిట్టిస్తున్నారని ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన బుద్దా వెంకన్న.. జూ.ఎన్టీఆర్‌ను అడ్డుపెట్టుకుని కొడాలి నాని మైండ్ గేమ్ ఆడుతున్నారు.. అసలు మేమెందుకు జూ.ఎన్టీఆర్‌ను తిడుతాం అని ప్రశ్నించారు. పైగా కొడాలి నానికి కాల్ షీట్లు ఇవ్వకుండా గతంలో జూ.ఎన్టీఆర్ తన్నితరిమేశాడు అప్పటి నుంచే జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా మైండ్ గేమ్ మొదలుపెట్టారని బుద్దా విమర్శించారు.
ఇదే బుద్దా వెంకన్న.. గతంలో భువనేశ్వరిని వైసీపీ నేతలు దూషించారంటూ ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌పై విరుచుకుపడ్డారు. సింహాద్రిలా పెద్ద గొడ్డలి తీసుకుని వస్తాడనుకుంటే చాగంటి ప్రవచనాలు చెబుతున్నాడంటూ తిట్టారు. అదే రోజు వర్ల రామయ్య కూడా అసలు మేనల్లుడిగా జూ.ఎన్టీఆర్ విఫలమయ్యారని మాట్లాడారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలను వదులుకుంటావా అంటూ జూ.ఎన్టీఆర్‌పై వర్ల రామయ్య ఫైర్ అయ్యారు.
మొన్నటికి మొన్న వర్సిటీ పేరు మార్పు సమయంలో.. తాతకు జూనియర్ ఎన్టీఆర్ వెన్నుపోటు అంటూ, అసలు ఆయన జూనియర్ ఎన్టీఆర్ కాదు జూనియర్ వైఎస్‌ఆర్ అంటూ ఇలా రకరకాలుగా టీడీపీ అనుకూల మనుషులు దాడి చేశారు. ఇప్పుడు మాత్రం బుద్దా వెంకన్న మేమెందుకు జూ.ఎన్టీఆర్‌ను తిడుతామంటూ కవర్ చేస్తున్నారు.