బూతులు, బెదిరింపులు.. రెచ్చిపోయిన అయ్యన్న
ఓ రోడ్డు నిర్మాణం విషయంలో స్థానిక మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అయ్యన్న. తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరింపులకు దిగారు.
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి బూతులతో రెచ్చిపోయారు. ఈసారి ఆయన బూతులతో విరుచుకుపడింది ప్రతిపక్షంపై కాదు.. బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారులపై. నర్సీపట్నం పట్టణంలో పర్యటించిన అయ్యన్న మున్సిపల్ అధికారులపై నోటికి వచ్చినట్లు అసభ్యకరమైన బూతులు ఉపయోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
అనకాపల్లి నర్సీపట్నం మున్సిపల్ అధికారులపై మరోసారి రెచ్చిపోయిన అయ్యన్న..
— Telugu Scribe (@TeluguScribe) June 18, 2024
చెప్పరాని భాషలో అధికారులపై బూతులు మాట్లాడిన అయ్యన్న.
తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరింపు.
కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడుకులు అంటూ బూతులు..
ఇష్టం లేకపోతే దెం..యండి అంటూ అరుపులు..
త్వరలో నేను… pic.twitter.com/xyjt1iHdbg
ఓ రోడ్డు నిర్మాణం విషయంలో స్థానిక మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అయ్యన్న. తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరింపులకు దిగారు. రోడ్ల నిర్మాణంలో ఏ మాత్రం నాణ్యత లేదని అధికారులపై మండిపడ్డారు. కళ్లు మూసుకుపోయాయా అంటూ అధికారులను తీవ్ర పదజాలంతో దూషించారు. అందరిపై చర్యలు తీసుకుంటానన్నారు.
ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలంటూ ఓ బూతు పదం వాడుతూ వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే తాను స్పీకర్‌ను అవుతున్నానని.. మిమ్మల్ని అసెంబ్లీలో గంటల కొద్ది నిలబెడతానంటూ అధికారులను హెచ్చరించారు. ఐతే అయ్యన్న వాడిన భాషను తప్పుపడుతున్నారు ప్రభుత్వ అధికారులు. తప్పు చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ.. కుటుంబ సభ్యులను లాగి బూతులు తిట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.