తెలుగుదేశం, జనసేన ఫస్ట్ లిస్ట్ ఇదే
మొత్తం 118 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఎట్టకేలకు తెలుగుదేశం, జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఉండవల్లి వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా మొదటి జాబితాను విడుదల చేశారు.
మొత్తం 118 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 94 మందిలో 23 మంది కొత్త అభ్యర్థులున్నారని చెప్పారు చంద్రబాబు. ఇక బీజేపీ కలిసివస్తే తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. ఓట్లు చీలకూడదనే తక్కువ సీట్లు తీసుకున్నామన్నారు జనసేనాని పవన్ కల్యాణ్.
తెలుగుదేశం పార్టీ మొత్తం 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా... పవన్ కల్యాణ్ 24 స్థానాల్లో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. జనసేన అభ్యర్థులు వీరే. నెల్లిమర్ల నుంచి మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ అభ్యర్థిత్వాలను ప్రకటించారు.
తెలుగుదేశం అభ్యర్థులు వీరే..
ఇచ్ఛాపురం- బెందాళం అశోక్
టెక్కలి-అచ్చెన్నాయుడు
ఆమదాలవలస-కూన రవికుమార్
రాజాం-కోండ్రు మురళి
కురుపాం - తొయ్యక జగదీశ్వరి
పార్వతీపురం - విజయ్ బోనెల
సాలూరు - గుమ్మడి సంధ్యారాణి
బొబ్బిలి-ఆర్‌ఎస్‌వీకేకే రంగారావు(బేబీ నాయన)
గజపతినగరం - కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం - అదితి గజపతిరాజు
విశాఖ ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణబాబు
విశాఖ వెస్ట్ - పీజీవీఆర్ నాయుడు
అరకు - సియ్యారి దొన్ను దొర
పాయకరావుపేట - వంగలపూడి అనిత
నర్సీపట్నం - చింతకాయల అయ్యన్నపాత్రుడు
తుని-యనమల దివ్య
పెద్దాపురం - నిమ్మకాయల చినరాజప్ప
అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణ రెడ్డి
ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు
పి.గన్నవరం - రాజేశ్ కుమార్
కొత్తపేట - బండారు సత్యానంద రావు
మండపేట - జోగేశ్వరరావు
రాజమండ్రి సిటీ - ఆదిరెడ్డి వాసు
జగ్గంపేట - జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ)
ఆచంట - పితాని సత్యనారాయణ
పాలకొల్లు - నిమ్మల రామానాయుడు
ఉండి - మంతెన రామరాజు
తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ
ఏలూరు - బాదెటి రాధాకృష్ణ
చింతలపూడి - సోంగ రోషన్
తిరువూరు - కొలికపూడి శ్రీనివాస్
నూజివీడు - కొలుసు పార్థసారథి
గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ - వెనిగండ్ల రాము
పెడన - కాగిత కృష్ణ ప్రసాద్
మచిలీపట్నం - కొల్లు రవీంద్ర
పామర్రు - వర్ల కుమార రాజ
విజయవాడ సెంట్రల్ - బొండ ఉమ
విజయవాడ ఈస్ట్ - గద్దె రామ్మోహన రావు
నందిగామ - తంగిరాల సౌమ్య
జగ్గయ్యపేట - శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య
తాడికొండ - తెనాలి శ్రవణ్ కుమార్
మంగళగిరి - నారా లోకేశ్