Telugu Global
Andhra Pradesh

టీడీపీని నడుపుతున్నదెవరు?

మామూలుగా అయితే రాజకీయ పార్టీల కార్యక్రమాల వల్ల మీడియాకు వార్తలు అందుతాయి. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్సులో నడుస్తోంది. అంటే ఎల్లో మీడియాలో వచ్చే వార్తలను బట్టి టీడీపీ నడుచుకుంటోంది.

టీడీపీని నడుపుతున్నదెవరు?
X

అదేం ప్రశ్న.. అస‌లా అనుమానం ఎందుకొచ్చింది.. కొత్తగా చెప్పాల్సిందేముంది చంద్రబాబునాయుడే కదా? అని అనుకుంటున్నారా. అలా అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబే అనటంలో సందేహంలేదు. మామూలుగా అయితే అధినేతే పార్టీని నడుపుతారు. కానీ ఇక్కడ కొంతకాలంగా వ్యవహారం తేడాగా ఉంది. అంటే కుక్కు తోకను ఊపటంలేదు. తోకే కుక్కను ఊపుతున్నట్లుంది. అంటే ఎల్లో మీడియానే టీడీపీకి మార్గదర్శకత్వం చేస్తోందని అర్థ‌మవుతోంది.

పరిస్థితి ఎలా తయారైందంటే ఎల్లో మీడియా లేకపోతే చంద్రబాబు, టీడీపీ లేదన్నట్లుగా తయారైంది వ్యవహారం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఎల్లో మీడియాలో వార్తలు రావటం వెంటనే చంద్రబాబు అండ్ కో రెచ్చిపోవటం. మామూలుగా అయితే రాజకీయ పార్టీల కార్యక్రమాల వల్ల మీడియాకు వార్తలు అందుతాయి. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్సులో నడుస్తోంది. అంటే ఎల్లో మీడియాలో వచ్చే వార్తలను బట్టి టీడీపీ నడుచుకుంటోంది.

జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఒక కథనం ప్రచురితం అవుతుంది. అంతే వెంటనే టీడీపీ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడిపోతారు. అంతేకాకుండా పార్టీలోని ఎస్సీ ప్రజాప్రతినిధులతో సదస్సు నిర్వహించి ప్రభుత్వంపై బురదచల్లేస్తారు. అలాగే పలానా ఊరు రోడ్డు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఫొటోలతో కలిపి వార్తస్తొంది. వెంటనే తమ్ముళ్ళ రంగంలోకి దిగిపోయి ఆరోపణలతో రెచ్చిపోతారు. జగన్ ప్రభుత్వం అప్పులమీదే నడస్తోందని మరో కథనం అచ్చవుతుంది. ఇంకేముంది వెంటనే సీనియర్ నేత‌ యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శిస్తు రంగంలోకి దిగేస్తారు.

జగన్ హయాంలో దళితులతో పాటు బీసీలపైన దాడులు జరుగుతున్నాయన్న వార్త రాగానే వెంటనే చంద్రబాబు ట్విట్టర్ ఖాతాలో ప్రభుత్వంపై విరుచుకుపడిపోతారు. లా అండ్ ఆర్డర్ అదుపుతప్పిపోయిందని గాలిని పోగేసి కథనం అచ్చు అవ్వ‌డం ఆలస్యం వెంటనే తమ్ముళ్ళంతా గవర్నర్ కలిసి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందనే వార్త రావటం ఆలస్యం వెంటనే దేవినేని ఉమ లాంటివాళ్ళు మీడియా సమావేశంలో రెచ్చిపోతారు. ఏ అంశంలో అయినా సరే ఎల్లో మీడియాలో వార్త, కథనం రావటం ఆలస్యం చంద్రబాబు అండ్ కో నాలుగు రోజులు నానా గోలచేసి మరో కథనం కోసం వెయిట్ చేసే పరిస్థితికి దిగజారిపోయారు. ఇప్పుడు చెప్పండి టీడీపీని నడుపుతున్నదెవరో?

First Published:  28 Jun 2023 11:22 AM IST
Next Story